Advertisementt

లక్ష్మీ బాంబ్.. అక్కడ థియేటర్లలో పేలనుంది..

Wed 30th Sep 2020 07:51 PM
akshay kumar,bollywood,lakshmi bomb,kiara advani,raghava lawrence  లక్ష్మీ బాంబ్.. అక్కడ థియేటర్లలో పేలనుంది..
Laxmi Bomb releasing in Theatres.. But.. లక్ష్మీ బాంబ్.. అక్కడ థియేటర్లలో పేలనుంది..
Advertisement
Ads by CJ

కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో సినిమాలన్నీ ఓటీటీ ద్వారా ప్రేక్షకులని పలకరిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలన్నీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. సినిమాలైతే రిలీజ్ అయ్యాయి కానీ దేనికీ కూడా సరైన స్పందన రాలేదు. కరెక్ట్ గా చెప్పాలంటే మాస్ ప్రేక్షకులని ఉర్రూతలూగించే సినిమా ఓటీటీలో విడుదల కాలేదు.

తాజాగా అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ ఆ లోటుని తీరుస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన, అవబోతున్న సినిమాల జాబితాని పరిశీలిస్తే లక్ష్మీ బాంబ్ పక్కా మాస్ చిత్రంగా చెప్పుకోవచ్చు. తమిళంలో సూపర్ హిట్ అయిన కాంచన సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 9వ తేదీ నుండి డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉండనుంది.

ఐతే ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అదే రోజున థియేటర్లలోనూ రిలీజ్ అవుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో లక్ష్మీ బాంబ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ మేరకు చిత్రబృందం ప్రకటన కూడా చేసింది. మరి ఈ సినిమానైనా మాస్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపిపిస్తుంది.

Laxmi Bomb releasing in Theatres.. But..:

Laxmi Bomb releasing in Theatres.. But..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ