Advertisementt

నిశ్శబ్దం ఓటీటీ రిలీజ్ పై అనుష్క స్పందన ఇదే...

Wed 30th Sep 2020 08:05 AM
nmissabdam,anushka shetty,madhavan,anjali,shalini pandey,hemanth madhukar,konavenkat  నిశ్శబ్దం ఓటీటీ రిలీజ్ పై అనుష్క స్పందన ఇదే...
Anushka about Nissabdam OTT release.. నిశ్శబ్దం ఓటీటీ రిలీజ్ పై అనుష్క స్పందన ఇదే...
Advertisement
Ads by CJ

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన నిశ్శబ్దం వేసవిలో రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోకుండా వచ్చిన కరోనా ఉపద్రవం అన్ని ప్లాన్లనీ మార్చివేసింది. ఒక్కసారిగా థియేటర్లన్నీ మూతపడడంతో నిశ్శబ్దం రిలీజ్ వాయిదా పడింది. ఐతే ఆ తర్వాత నిశ్శబ్దం చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఖండించారు. నిశ్శబ్దం సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే రిలీజ్ చేస్తామని, పుకార్లని నమ్మవద్దని చిత్ర నిర్మాతలు స్పందించారు.

ఐతే రోజులు గడుస్తున్నా థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఇక చేసేదేమీ లేక ఓటీటీకి ఫిక్సయ్యారు. అక్టోబర్ 2వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయమై అనుష్క శెట్టి ఈ విధంగా స్పందించింది. నిశ్శబ్దం సినిమాని థియేటర్లలో రిలీజ్ చేద్దామనే ఇన్నాళ్ళు వెయిట్ చేసామని, కానీ పరిస్థితులు అనుకూలించక, నిర్మాతకి నష్టం కలిగిస్తున్నాయన్న కారణంగా ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నామని తెలిపింది.

ఇంకా తనకి కూడా థియేటర్లో చూడడమే ఇష్టమని, ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూడటం థ్రిల్లింగ్ గా ఉంటుందని, నిశ్శబ్దం సినిమాకి ఆ థ్రిల్ మిస్ అవుతున్నానని తెలిపింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని కోన ఫిలిమ్ కార్పోరేషన్ బ్యానర్ లో కోనవెంకట్ నిర్మించగా అంజలి,, మాధవన్, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో నటించారు.

Anushka about Nissabdam OTT release..:

Anushka about Nissabdam OTT release..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ