Advertisementt

మెగాస్టార్ లూసిఫర్ లో రమ్యక్రిష్ణ..?

Tue 29th Sep 2020 10:36 PM
chiranjeevi,megastar,lucifer,meher ramesh  మెగాస్టార్ లూసిఫర్ లో రమ్యక్రిష్ణ..?
Ramyakrishna to Play a role in Lucifer remake..? మెగాస్టార్ లూసిఫర్ లో రమ్యక్రిష్ణ..?
Advertisement
Ads by CJ

కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మరో రెండు సినిమాలని లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. మళయాల చిత్రమైన లూసిఫర్ తెలుగు రీమేక్ తో పాటు తమిళ చిత్రమైన్ వేదాలం రీమేక్ కూడా ఈ లిస్టులో ఉంది. ఐతే ఆచార్య అనంతరం మెహెర్ రమేష్ తో వేదాలం మొదలెట్టనున్నాడని వినిపిస్తుంది. లూసిఫర్ చిత్రాన్ని వేదాలం రీమేక్ తర్వాత పట్టాలెక్కించనున్నాడట.

ఐతే లూసిఫర్ రీమేక్ లో కీలకమైన పాత్ర కోసం చాలా రోజులుగా సెర్చింగ్ జరుగుతుంది. మెగాస్టార్ సోదరిగా నటించే వారికోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ విషయమై చాలా మంది సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సుహాసిని, ఖుష్బూ మొఅలగు వారు నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా మరో పేరు తెరమీదకి వచ్చింది.

బాహుబలి సినిమాలో శివగామిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రమ్యక్రిష్ణని లూసిఫర్ రీమేక్ లో మెగాస్టార్ సోదరిగా నటింంపజేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మరి నిజంగా రమ్యక్రిష్ణ గారిని సంప్రదించారా లేదా తెలియాలంటే చిత్రబృందం స్పందించాల్సిందే.

Ramyakrishna to Play a role in Lucifer remake..?:

Ramyakrishna to Play a role in Lucifer remake..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ