Advertisementt

మళ్లీ దేవుడు వరమిచ్చాడంటూ.. బండ్ల ఆగట్లే!

Wed 30th Sep 2020 05:45 PM
bandla ganesh,happy,pawan kalyan,green signal,movie  మళ్లీ దేవుడు వరమిచ్చాడంటూ.. బండ్ల ఆగట్లే!
Bandla Ganesh Happy with Pawan Kalyan Green Signal మళ్లీ దేవుడు వరమిచ్చాడంటూ.. బండ్ల ఆగట్లే!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో సినిమాల్లోనే కమెడియన్ కాదు.. నిజ జీవితంలోను కొన్ని విషయాల్లో కామెడీ చేసే బండ్ల గణేష్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం. ఏకంగా పవన్ ని దేవుడు అంటూ సంబోధిస్తూ ఆయన్ని తెగ ఎత్తేస్తుంటాడు, కరోనా టైంలో దేవుడు పవన్ పలకరియ్యలేదని.. కాస్త అలిగిన బండ్ల గణేష్ దేవుడి మీద అలగకూడదు అంటాడు. ఇక దేవుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తారా.. అంటే నేను దేవుడి కరుణ కోసమే ఎదురు చూస్తున్నా అంటాడు. తాజాగా బండ్ల గణేష్ ఏదో సర్ప్రైజ్ అంటూ ఊరిస్తూ..ఓ అద్భుతమైన వార్తను చెబుతా అన్నాడు.

అన్నట్టుగానే బండ్ల గణేష్ ఈ రోజు ఉదయం ఓ ట్వీట్ చేసాడు. అది పవన్ కళ్యాణ్‌ని కలిసి బండ్ల ఏదో హామీ అయితే తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే బండ్ల గణేష్ వేసిన ట్వీట్ అలానే ఉంది. నా బాస్ ఓకే చెప్పారు. నా కలలు మరోసారి నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు అంటూ ట్వీట్ వెయ్యడం చూస్తుంటే బండ్ల గణేష్‌తో పవన్ కళ్యాణ్ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడనిపిస్తుంది. 

ఎలాగూ వరస సినిమాలతో పవన్ కళ్యాణ్ పరుగులు పెడుతున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ పూర్తి చేస్తుండగా... క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి మూవీస్‌ని లైన్‌లో పెట్టాడు. ఇక తాజాగా బండ్ల గణేష్‌కి హామీ ఇచ్చాడంటే మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి బండ్ల - పవన్ డైరెక్టర్ ఎవరో చూడాలి.

Bandla Ganesh Happy with Pawan Kalyan Green Signal:

Again movie in Pawan Kalyan and Bandla Ganesh combination

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ