Advertisementt

‘ఆచార్య’ కోసం చరణ్‌ అలా మారుతున్నాడా?

Wed 30th Sep 2020 12:01 AM
mega power star,ram charan,weight,acharya,chiranjeevi  ‘ఆచార్య’ కోసం చరణ్‌ అలా మారుతున్నాడా?
Ram Charan to gain weight for Acharya ‘ఆచార్య’ కోసం చరణ్‌ అలా మారుతున్నాడా?
Advertisement
Ads by CJ

కరోనా కారణంగా వాయిదా పడిన ఆచార్య సినిమా షూటింగ్ ఇదిగో మొదలవుతుంది, అదిగో మొదలవుతుంది అనడమే కానీ.. చిత్ర బృందం మాత్రం ఇంతవరకు సినిమా చిత్రీకరణపై స్పందించడం లేదు. అయితే ఆచార్య షూటింగ్ అక్టోబర్ చివరి వారం నుండి అయినా లేదంటే నవంబర్ నుండి కానీ మొదలు కావొచ్చని.. అయితే ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న చరణ్ డేట్స్ కోసం RRR దర్శకుడు రాజమౌళిని రిక్వెస్ట్ చేసినట్టుగా ఆచార్య హీరో చిరు చెప్పాడు. అయితే రామ్ చరణ్ ముందు ఆచార్య షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. అందుకోసం మేకోవర్ అవుతున్నాడని అంటున్నారు.

తాజాగా ఆచార్యలో తాను చెయ్యబోయే ముప్పై నిమిషాల పాత్ర కోసం రామ్ చరణ్ బరువు పెరుగుతున్నాడట. RRR కోసం ఫిట్ పోలీస్ ఆఫీసర్‌గా సిక్స్ ప్యాక్ బాడీ మాదిరి బాడీని షేప్ చేసిన రామ్ చరణ్ ఆచార్యలోని ముప్పై నిమిషాల కేరెక్టర్ కోసం బరువు పెరుగుతున్నాడనే న్యూస్ కాస్త ఆశ్చర్యకర విషయమే. ఎందుకంటే దర్శకుడు కొరటాల శివ, చరణ్ పాత్రని బాగా హైలెట్ చేస్తున్నాడని.. అందుకే ఆ పాత్ర కోసం చరణ్ రిస్క్ చేయబోతున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. 

నక్సలైట్‌గా చరణ్ పోషించబోయే విలక్షణమైన పాత్ర కోసం చరణ్ బరువు పెరగడం ఎప్పుడో మొదలెట్టాడట. మరి ఆచార్య కోసం బరువు పెరిగి మళ్ళీ.. RRR కోసం మరోసారి ఫిట్‌నెస్ మొదలెట్టాలన్నమాట. పాపం చెర్రీకి ఎన్ని కష్టాలో కదా.!

Ram Charan to gain weight for Acharya:

Mega power star To Put On Weight For Acharya?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ