దేశం అంతటా.. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంపై గుండెపగిలి బాధతో.. శోకతప్త హృదయాలతో ఆయనకు ఆశృనివాళులు అర్పిస్తుంటే.... బాలీవుడ్‌లో మాత్రం డ్రగ్స్ కేసు రకరకాల మలుపులు తిరుగుతుంది. నేషనల్ మీడియా, సౌత్ మీడియా మొత్తం బాలుగారి అంతక్రియలను న్యూస్ చూసుకుంటుంటే.. బాలీవుడ్ మీడియా మొత్తం డ్రగ్స్ కేసులో సమన్లు అందుకుని ఎన్‌సీబీ ఎదుట హాజరవుతున్న హీరోయిన్స్ మీద ఫోకస్ పెట్టింది. నిన్న ఎన్‌సీబీ ఎదుట రకుల్ ప్రీత్ హాజరవగా నేడు టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే, శ్రద్ద కపూర్, సారా అలీఖాన్‌లు హాజరయ్యారు. దీపికా పదుకొనేతో ఆమె భర్త రణ్వీర్ సింగ్ హాజరవుతాడని.. అందుకోసం రణ్వీర్ ఎన్‌సీబీ అధికారులకు పిటిషన్ పెట్టుకున్నాడని అన్నప్పటికీ... అదేమి లేదని దీపికా మాత్రం ఒంటరిగానే విచారణకు హాజరవుతున్నట్టుగా ఈ మెయిల్ పంపిందట ఎన్‌సీబీ అధికారులకి.
ఇక ఈ రోజు ఉదయం దీపికా పదుకొనే ఒంటరిగానే ఎన్‌సీబీ ఎదుట విచారణకు హాజరవగా.. అక్కడ ఎన్‌సీబీ ఎదుట దీపికా పదుకొనే పొంతనలేని సమాధానాలతో ఎన్‌సీబీ అధికారులని కన్ఫ్యూజ్ చేసినట్లుగా చెబుతున్నారు. తన మేనేజర్ కరిష్మాతో తనకు కెరీర్‌కి సంబంధించిన సాధారణ సంబంధాలు తప్ప డ్రగ్స్ సంబంధాలు లేవని ఎన్‌సీబీ ఎదుట దీపిక చెప్పినట్టుగా చెబుతున్నారు. ఇక దీపికాని కొంతమంది అధికారులు ప్రశ్నిస్తుండగా.. మరో హీరోయిన్ శ్రద్ద కపూర్‌ని మరికొంతమంది అధికారులు విచారించారని తెలుస్తుంది.
ఇక సారా అలీఖాన్‌ని కూడా కొంతమంది అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీపిక సమాధానాలు తమకు సంతృప్తికరంగా లేవని ఎన్‌సీబీ అధికారులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉండగా 2019 లో కరణ జోహార్ ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ వాడకంపై కూడా ఎన్‌సీబీ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది.