Advertisementt

బిగ్‌బాస్‌ 4: హైలెట్ అవ్వాలంటే అవి ముఖ్యమా?

Sun 27th Sep 2020 08:18 PM
bigg boss,season 4,swathi dixit,pampering,romance,highlight  బిగ్‌బాస్‌ 4: హైలెట్ అవ్వాలంటే అవి ముఖ్యమా?
Contestants learned these from Bigg Boss 4 బిగ్‌బాస్‌ 4: హైలెట్ అవ్వాలంటే అవి ముఖ్యమా?
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్ గేమ్ అంటేనే స్ట్రాటజీ. ఒక వారం ఒకరు హైలెట్ అయితే మరో వారం మరొకరు. ప్రేక్షకుల మదిలో ఎప్పటికప్పుడు కంటెస్టెంట్స్ మారిపోతుంటారు. కొంతమందికి ఒక్కరే ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే.. కొంతమందికి నలుగురైదుగురు ఉంటారు. ఇక వారం వారం మార్చుకునే కంటెస్టెంట్స్ కూడా వుంటారు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఏ కంటెస్టెంట్ అయినా హైలెట్ అయ్యేది గొడవల వలనో లేదంటే అమ్మాయిలతో పెంపరింగ్ చేసే విషయంలోనే అనేది.. ఇప్పుడు సీజన్ 4 కంటెస్టెంట్స్‌లో వస్తున్న అనుమానం. గొడవలు పడితే బిగ్‌బాస్ హైలెట్ చేస్తూ మంచి ఫుటేజ్ ఇస్తారు.. దానికి క్రేజ్ వస్తుంది. లేదంటే అమ్మాయిలతో మాట్లాడుతూ వాళ్ళని పొగుడుతూ... లవ్ ట్రాక్ నడిపినా హైలెట్ అవ్వొచ్చు అనేది బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్‌ని చూస్తే అర్ధమవుతుంది.

మనుషులు రోబో టాస్క్‌లో సోహెల్, మెహబూబ్‌లు గట్టిగా అరుస్తూ బూతులు తిడుతూ ఆట తమవైపు తిప్పుకుందామనుకున్నారు. నిజంగా బిగ్‌బాస్ అదే గొడవని హైలెట్ చేసి చూపించాడు. ఇక అఖిల్, అభిజిత్.. మోనాల్‌తో నడిపే ట్రాక్‌ని బిగ్‌బాస్ హైలెట్ చేస్తున్నాడు. గత రాత్రి సాక్షి దీక్షిత్ బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వగా ఆమెతో అఖిల్, అమ్మ రాజశేఖర్, నోయెల్, అవినాష్‌లు పార్టీ చేసుకున్నారు. ఆ అమ్మాయి సాక్షి అబ్బాయిలు ఇచ్చిన పెరఫార్మెన్స్‌తో వాళ్ళ నలుగురిని ఎపిక్ చేసుకుని పార్టీ చేసుకుంది. ఇక ఆ పార్టీలో పాటలు, ఫుడ్, డాన్స్‌లు, స్విమ్మింగ్ అబ్బో అంతా ఇంతా కాదు. అది చూసిన సోహెల్, మెహబూబ్ లు బాగా డిజప్పాయింట్ అయ్యారు.

మనం ఏదో మిస్ అవుతున్నాం.. ఎక్కడో ఏదో మిస్ అవుతుంది మనం అందుకే హైలెట్ అవ్వడం లేదంటూ సోహెల్ మొదలెట్టగా.. దానికి ఇక్కడ హైలెట్ అవ్వాలంటే అమ్మాయిలతో ట్రాక్ నడపాలంటూ మెహబూబ్ చెప్పడం చూస్తుంటే వాళ్ళు హౌస్‌లోకి ఎలాంటి క్లారిటీతో అడుగుపెట్టారో అర్ధమవుతుంది. అఖిల్ కూడా మోనాల్‌తో మాట్లాడుతూ ఉన్న ఫుటేజ్‌‌నే బిగ్‌బాస్ చూపించడం చూసిన వారెవరైనా బిగ్‌బాస్‌కి వెళ్లి గొడవైన పడాలి, లేదంటే అమ్మాయిలతో ట్రాక్ అయినా నడపాలి అనేది ఇక వెళ్లబోయే కంటెస్టెంట్స్ కి ఫుల్ క్లారిటీ వచ్చేలా చేసింది సీజన్ 4. 

Contestants learned these from Bigg Boss 4:

Gossips raises on Bigg Boss 4 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ