ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేసాడు. తమిళ చిత్రమైన తడం చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఐతే ఈ సినిమాకి ఓటీటీ నుండి భారీ ఆఫర్లు వచ్చాయట. కానీ హీరో రామ్ ఓటీటీ వైపు మొగ్గు చూపడం లేదని టాక్. థియేటర్లు ఓపెన్ అయ్యే వరకూ వెయిట్ చేసి, ఆ తర్వాతే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఐతే థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం సినిమా షూటింగులు, కొత్త సినిమా అనౌన్స్ మెంట్లు వస్తున్నాయి. రామ్ కూడా నెక్స్ట్ ప్రాజెక్టుని మొదలు పెట్టబోతున్నాడట. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి సూపర్ హిట్ చిత్రాలు తీసిన వివేక్ ఆత్రేయ దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.
ప్రస్తుతానికి ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని, మరికొద్ది రోజుల్లో అధికారిక సమచారం బయటకు వస్తుందని తెలుస్తుంది. ఐతే క్లాస్ సినిమాలు తీసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఇప్పుడిప్పుడే మాస్ ప్రేక్షకులకి దగ్గరవుతున్న రామ్, ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.