బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఏదో ఒక రంగంలో తమ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నవారే. క్రేజ్ - డబ్బు లేకపోవచ్చు కానీ.. వాళ్ళకి ఓ కేరెక్టర్ ఉంటుంది. క్రేజ్ కోసమో.. లేదంటే డబ్బు కోసమే బిగ్‌బాస్‌లోకి అడుగుపెడుతున్న కంటెస్టెంట్స్ కోకోల్లలు. కొంతమంది బిగ్ బాస్‌ని ఎక్సపీరియన్సు చెయ్యడానికి వచ్చామని చెబుతారు కానీ.. అంత ఖాళీగా అయితే ఎవరూ ఉండదు. పారితోషకాలకి పడిపోవడం కూడా ఇక్కడ మెయిన్‌గా ఉంటుంది. అయితే ఈ సెలబ్రిటీస్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాకా కొంతమంది కన్నింగ్ ప్రోజెక్ట్ అవడం, కొంతమంది గొడవల్లోగా ఆరితేరిపోయినట్టుగా కనిపించడం, మరికొంతమందిని ప్రేమ పక్షుల్లా ప్రోజెక్ట్ చెయ్యడం, కంటెస్టెంట్స్ మధ్యన గొడవలు పెట్టి ప్రేక్షకులను పడెయ్యడమా అనేది బిగ్ బాస్ గేమ్ స్ట్రాటజీ.
అయితే కంటెస్టెంట్స్ కొంతమంది అసహనం, సహనం కోల్పోవడం, హద్దుమీరి మాట్లాడడం, లేదంటే సైలెంట్‌గా ఉండిపోవడం చూసిన హోస్ట్‌లు ప్రతి శనివారం లివింగ్ రూమ్‌లో వాళ్ళని కూర్చోబెట్టి క్లాస్ పీకడం చిన్నపిల్లలకి మాస్టర్ క్లాస్ పీకినట్టుగా పీకడం.. కంటెస్టెంట్స్ మొహాలు చిన్న బోవడం ప్రతి ఒక్క లాంగ్వేజ్ బిగ్‌బాస్‌లో చూస్తూనే ఉన్నాం. ఎక్కడిదాకో ఎందుకు గత శనివారం నాగార్జున బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌ని ప్రతి ఒక్కరిని నిలబెట్టి క్లాస్ పీకాడు. మరి బిగ్‌బాస్‌లోకి వచ్చాక ఇవన్నీ ఫేస్ చెయ్యాల్సిందే. కానీ తమ తమ ప్రొఫెషన్స్ లో ఎవరికీ వారే తోపులు. కానీ ఇలా ఓ షో కోసం హోస్ట్ చేతిలో క్లాస్ పీకించుకోవడం మాత్రం బయట నెటిజెన్స్ లో చాలామందికి నచ్చడం లేదు.
ఇక ఈ వారం రోబో - మనుషుల టాస్క్ లో రెండు టీమ్స్ సహనాన్ని కోల్పోయి మాటలను హద్దుమీరుతున్నాయి. అంటే ఈ శనివారం చలనను నాగ్ క్లాసుపీకడానికి రెడీ. క్లాస్ పీకించుకోవడానికి కంటెస్టెంట్స్ రెడీ అవ్వాలన్నమాట. పాపం బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కి క్రేజ్ కోసం, డబ్బు కోసం ఎన్ని కష్టాలు పడాలో కదా.