బాలీవుడ్ లో సక్సెస్ కాలేక టాలీవుడ్ కి వచ్చి ఇక్కడే జెండా పాతిన పూజాహెగ్డే ఇప్పుడు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోలంతా పూజాహెగ్డే చుట్టూనే తిరుగుతున్నారు. అయితే పూజాహెగ్డే కెరీర్ తొలినాళ్లలో సెట్స్ లో ఏమైనా ఇబ్బందులు పడ్డారా అన్న ప్రశ్నకు.. అబ్బే లేదండి ఇష్టమైన రంగంలోకి వచ్చినప్పుడు అలాంటి ఇబ్బందులు కామన్. అయినా కెరీర్ తొలినాళ్లలో షూటింగ్ ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు సెట్స్ మీదకెళ్తామా? అని ఎదురు చూసేదాన్ని. అలా షూటింగ్ స్పాట్ లో ఉత్సాహంగా ఉండేది. అంతేకాదు.. రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని సెట్ లో నేర్చుకోవాలనే తాపత్రయంతో రోజు సెట్స్ లోకి అడుగుపెట్టేదాన్ని.
అలా రోజు కొత్తగా ఎం నేర్చుకుందామా అనే ఆసక్తి, ఉత్సాహం ఇప్పటికి ఉంది. షూటింగ్ లో ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఇప్పటికి పెరుగుతుంది కానీ.. తరగడం లేదంటుంది పూజాహెగ్డే. ఇక పని మీద వ్యాపకం కూడా అలానే పెరుగుతూ వచ్చింది కానీ ఎలాంటి లోపం లేదంటుంది పూజ.
నటన మీద, పని మీద ప్రేమశక్తులు సినిమా సినిమాకి పెరుగుతూనే ఉన్నాయంటుంది పూజాహెగ్డే. ఇక నేను వరస సినిమాలతో బాగా బిజీగా ఉన్నా.. ఎలాంటి అలసట లేకుండా ఉత్సాహంగా పని చేసుకుంటూ వెళ్ళడానికి అదే కారణమంటుంది పూజాహెగ్డే.