Advertisementt

సినిమాలు లేకపోతేనేం.. దసరా ట్రీట్‌ అదిరిపోద్ది!!

Fri 25th Sep 2020 01:29 PM
vijaya dasami,treat,audience,star heroes,tollywood,movies  సినిమాలు లేకపోతేనేం.. దసరా ట్రీట్‌ అదిరిపోద్ది!!
Vijaya Dasami treat ready to Audience సినిమాలు లేకపోతేనేం.. దసరా ట్రీట్‌ అదిరిపోద్ది!!
Advertisement
Ads by CJ

దసరా అంటే సినిమా వాళ్లకు పెద్ద పండగ. భారీ బడ్జెట్ సినిమాలన్నీ దసరా పండగ కోసమే కాచుకుని కూర్చుంటాయి. మరి మరో నెలలో దసరా పండగ రాబోతుంది. కానీ కరోనా కారణంగా దసరా సీజన్ ని వదులుకోవాల్సిన పరిస్థితి. పెద్ద పండగని చాలామంది హీరోలు మిస్ చేసుకోవాల్సి వస్తుంది. కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలైనా థియేటర్స్ తెరిచినా దసరా పండగకి సినిమాలు విడుదల చేసేందుకు హీరోలు ముందుకు రారు. మరి ఈ దసరా సినీ ప్రియులని ఫుల్ గా డిస్పాయింట్ చేసేలా ఉంది. అయితే ఈ దసరాకి సినిమాలు విడుదల కాకపోవచ్చు కానీ...

సినిమా షూటింగ్స్ మధ్యలో ఉన్న సినిమాలు, షూటింగ్స్ పూర్తి చేసుకున్న సినిమాల పోస్టర్స్ కానీ, ఫస్ట్ లుక్స్ కానీ, భారీ బడ్జెట్ చిత్రాల టీజర్స్, మోషన్ పోస్టర్స్, లుక్స్ అన్ని విడుదల చేసేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి - బాలయ్య BB3, చిరు ఆచార్య, కరోనా కారణంగా ఆగిన RRR షూట్ మళ్ళీ మొదలైతే ఎన్టీఆర్ కొమరం భీం లుక్, కెజిఎఫ్ చాప్టర్ 2, వకీల్ సాబ్ టీజర్, నితిన్ రంగ్ దే టీజర్, ఇక కొన్ని సినిమాల టైటిల్స్ కూడా ఈ దసరాకే దర్శక నిర్మాతలు వదిలేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

మరి సినిమాలు విడుదల కాకపోతేనేమి... సినిమాల లుక్స్ తోనే హీరోలు అభిమానులకు ట్రీట్ ఇస్తారు. మరి దసరా మరీ చప్పగా ఉంటుంది అనుకుంటే.. కొంతలో కొంత ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మన హీరోలు. 

Vijaya Dasami treat ready to Audience:

Star Heroes Released their movies teasers for Vijaya Dasami

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ