చాలా మంది హీరోలు సినిమాల్లో ఎలాంటి లుక్‌లో కనిపిస్తారో అనేది వాళ్ళ ఫస్ట్ లుక్ బయటికి వచ్చేవరకు తెలియనివ్వరు. కారణం ఫ్యాన్స్ లోను, ప్రేక్షకుల్లోనూ తమ లుక్‌పై క్యూరియాసిటీ ఉంటే.. బావుంటుందనే ఉద్దేశ్యంతోనే. అయితే అల్లు అర్జున్ మాత్రం అలా ఆలోచించడం లేదు. పుష్ప ఫస్ట్ లుక్ ఇచ్చేశాం కదా... ఇక లుక్‌ని దాయడమెందుకు అనుకున్నాడేమో.. పుష్ప లుక్‌నే గత ఐదారు నెలలుగా మెయింటైన్ చేస్తున్న అల్లు అర్జున్.. ఎప్పుడు బడితే అప్పుడు జనాల్లోకి వచ్చేస్తున్నాడు. పుష్ప సినిమా ఫస్ట్ లుక్ లోనే అల్లు అర్జున్ ఊరమాస్ గా ఉండబోతున్నాడని అర్ధమైంది. ఇక షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడడంతో అల్లు అర్జున్ మాత్రం పుష్ప లుక్ తోనే తిరుగుతున్నాడు. అలాగని ఇంట్లోనే ఉన్నాడా? అంటే అదీ లేదు.
కొమరం భీం క్యారెక్టర్‌లో కనబడనున్న ఎన్టీఆర్ RRR లుక్ పై అందరిలో క్యూరియాసిటీ ఉంది. రాజమౌళి ఎప్పుడెప్పుడు లుక్ వదులుతాడా అని ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. ఇక ఎన్టీఆర్ కూడా కరోనా వచ్చాక బయటికి వచ్చింది లేదు. రామ్ చరణ్ అల్లూరి లుక్ బయటికొచ్చింది కాబట్టి అప్పుడప్పుడు బయటికి వస్తున్నాడు. కానీ అల్లు అర్జున్ పదే పదే పుష్ప మేకోవర్‌లోనే దర్శనమిస్తుంటే.. ఇక సినిమాలో అల్లు అర్జున్‌ని అలా చూశాక ఫ్యాన్స్ కి ఏం ఇంట్రెస్ట్ కలుగుతుంది అని అంటున్నారు. మరి అల్లు అర్జున్ మాత్రం కరోనాతో జన సంచారం తగ్గడంతో అప్పుడప్పుడు వాకింగ్, జాగింగ్, లొకేషన్స్ అంటూ జనాల్లో తెగ తిరిగేస్తున్నాడు.