హీరోలు ఒక సినిమా పూర్తయ్యేవరకు మరో సినిమా జోలికి వెళ్లరు. ఎక్కడో ఒకటీ అరా హీరో తప్ప ఒక సినిమా తరవాత మరో సినిమా చేస్తారు. కానీ హీరోయిన్స్‌కి సినిమాల్లో స్క్రీన్ స్పేస్ తక్కువ కాబట్టి.. ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు డేట్స్ ఇవ్వడమే కాదు.. ఒకపూట ఓ హీరోతో, మరో పూట మరో హీరోతో.. నైట్ ఇంకో హీరోతో షూటింగ్స్ చేస్తూ చాలా బిజీగా ఒత్తిడికి లోనవుతుంటారు. అలాగే హీరోయిన్స్ మీద నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, తాము నటించిన సినిమా ప్లాప్ అయినా హీరోయిన్స్ బాగా ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే అలా ఒత్తిడిగా అనిపించినప్పుడు పుష్పతో పాన్ ఇండియాని క్యాచ్ చేస్తున్న రష్మిక పిచ్చిపిచ్చిగా డాన్స్ చేస్తుందట. అలాగే జిమ్‌కి వెళ్లి విపరీతంగా వర్కౌట్స్ చేస్తుందట. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఐస్ క్రీమ్స్ తినడం, మ్యూజిక్ వినడం, డ్రామాలు చూడడం చేస్తుందట. లాక్ డౌన్ నుండి ఇప్పుడిప్పుడే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రష్మిక.. అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ కోసం వెయిటింగ్. అయితే తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన రష్మిక.. కరోనాతో జాగ్రత్తలు తీసుకోమని చెబుతుంది.
ఇక చిన్నప్పుడు స్కూల్ లో బాగా అల్లరి చేసేదాన్ని అని.. చదువు విషయంలో చాలా వీక్ అని.. దానికి కారణం తన పేరెంట్స్ కి చదువు పెద్దగా రాదని.. వారసత్వం ఎక్కడికి పోతుంది అంటూ సిల్లీ ఆన్సర్స్ ఇచ్చింది. ఇక పెళ్లి విషయంలో రష్మిక చెప్పిన సమాధానం మాత్రం హైలెట్. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏం చెయ్యాలి అని అడగగానే.. రష్మిక ముందు నన్ను కలవండి, నన్ను కలవడానికి నా టీం ఉపయోగపడుతుంది. అప్పుడు ఆలోచిద్దాం పెళ్లి గురించి అని చెబుతుంది రష్మిక.