Advertisementt

రంగ్ దే.. నితిన్ తొందరపడుతున్నాడా..?

Wed 23rd Sep 2020 09:02 PM
keerthy suresh,nithin,rang de,venku atluri  రంగ్ దే.. నితిన్ తొందరపడుతున్నాడా..?
Is Nithin hurry to complete..? రంగ్ దే.. నితిన్ తొందరపడుతున్నాడా..?
Advertisement
Ads by CJ

వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్ దే షూటింగ్ ఈ రోజే రీస్టార్ట్ అయ్యింది. లాక్డౌన్ తర్వాత మళ్లీ ఈరోజే సెట్స్ లోకి వచ్చారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే రంగ్ దే విషయంలో నితిన్ తొందరపడుతున్నాడేమో అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా రంగ్ దే సినిమాపై రకరకాల వార్తలు వచ్చాయి. చక చకా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఓటీటీ ఛానెల్స్ రంగ్ దే చిత్రానికి మంచి ఆఫర్లు ఇస్తున్నాయట. అందువల్ల చిత్ర నిర్మాత ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారని వినబడుతుంది. నితిన్ కూడా ఓటీటీకి ఓకే చెబుతున్నాడని సమాచారం. నిర్మాతకి నష్టం రాకుడదన్న ఉద్దేశ్యంతో నితిన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటున్నారు. 

ఈ విషయమై నితిన్ అభిమానుల్లో కొంత నిరాశచెందారు. రంగ్ దే టీజర్ కి వచ్చ్చిన రెస్పాన్స్ చూసినవారందరూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని, నితిన్ కెరీర్లో మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని భావించారు. కానీ ఇప్పుడు రంగ్ దే ఓటీటీలో వస్తుందన్న వార్తల వల్ల నితిన్ తొందరపడుతున్నాడేమో అనుకుంటున్నారు. థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు ఆగితే మంచి హిట్ వస్తుందని చెబుతున్నారు.

Is Nithin hurry to complete..?:

Is Nithin hurry to complete..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ