కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా అనంతరం చిరంజీవి చేయబోయే సినిమా విషయమై రకరకాల వార్తలు వచ్చాయి. ముందుగా లూసిఫర్ రీమేక్ సెట్స్ మీదకి వెళ్తుందని అన్నారు. ఆ తర్వాత మెహెర్ రమేష్ తో సినిమా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం మెహెర్ రమేష్ తో చిరంజీవి సినిమా ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే అని వినిపిస్తుంది. ఐతే ఈ విషయమై అధికారిక సమాచారం రానప్పటికీ ఇదే ఫిక్స్ అని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మెగా అభిమానులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. కానీ చిరంజీవి నమ్మకంగా ఉన్నారట. మెహెర్ రమేష్ వినిపించిన స్క్రిప్టు బాగా నచ్చడంతో చిరంజీవి ఓకే చేసారట. ఐతే కొన్ని కండిషన్లు పెట్టారట. ముందుగా బడ్జెట్ విషయంలో పరిమితులు విధించాడట. పరిమిత బడ్జెట్ కంటే మించి ఎక్కువ ఖర్చు పెట్టవద్దని చెప్పాడట. మెహెర్ రమేష్ గత చిత్రాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. సో.. పరిమితికి మించి బడ్జెట్ పెంచకుండా ఉండేందుకు ముందే కండిషన్లు విధించారని అంటున్నారు. మరి చిరు సూచించిన పరిమిత బడ్జెట్లో సినిమా తెరకెక్కిస్తాడా లేదా చూడాలి.