బాలీవుడ్ డ్రగ్ కేసు ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ మెడకి చుట్టుకుంది. నిన్నటివరకు రకుల్ పేరు మీడియాలో ప్రముఖంగా వినిపించగా నేడు సూపర్ స్టార్ మహేష్ వైఫ్ నమ్రత ఈ డ్రగ్ కేసులో సుశాంత్ సింగ్ రాజపుట్ మాజీ మేనేజర్‌తో చాట్ చేసినట్టుగా నేషనల్ మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. నమ్రత, సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్‌తో డ్రగ్స్‌కి సంబంధించి చాట్ చేసినట్టుగా.. ఎంసీబీ త్వరలోనే నమ్రతను ఈ కేసులో విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా నేషనల్ మీడియాలో రకరకాల న్యూస్‌లు వైరల్ అవుతున్నాయి. అయితే అసలు నమ్రతకు డ్రగ్స్ తీస్కోవాల్సిన ఖర్మ ఏమిటి? మహేష్‌కి డ్రగ్స్ అలవాటు కూడా లేదు? అలాంటప్పుడు నమ్రత డ్రగ్స్ అవసరం ఏముంది.
ఒకవేళ డ్రగ్స్ వ్యాపారం చేస్తుందా అంటే.. మహేష్‌కే బోలెడంత ఆస్తి ఉంది. అలాగే నమ్రతకి కూడా బాగా ఉంది. ఇక నమ్రత పార్టీలలో ఏమైనా డ్రగ్స్ వాడుతోందా? ఆమె ఎవరినన్నా డ్రగ్స్ తీసుకునేలా ఎంకరేజ్ చేస్తుందా? అంటే నమ్రత పెద్దగా పార్టీ ఇచ్చిన దాఖలాలు లేవు. మహేష్‌తో, పిల్లలతో టైం స్పెండ్ చెయ్యడం తప్ప నమ్రత పెద్దగా ఫోకస్ అవదు. ఇక ముంబైలోను, హైదరాబాద్‌లోను నమ్రతకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలున్నాయి. అలాగని నమ్రత డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది అంటే నమ్మడానికి లేదు. అయినా ఎంసీబీ దగ్గర ఉన్న లిస్ట్‌లో ఎస్ అనే పేరుని పట్టుకుని.. నేషనల్ మీడియా నమ్రత శిరోద్కర్ అని ఎలా చెప్పగలుగుతుంది.
అయితే ప్రస్తుతం నమ్రత ముంబైలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే నమ్రత పిఆర్ టీం లైన్‌లోకొచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఊరుకోమని.. నమ్రతకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని ఖండిస్తుంది. అయితే ఇది రాజకీయ ఎత్తుగడ లేక ఎవరైనా కావాలని ఇరికిస్తున్నారా అనేది వేచి చూద్దాం. పోలీస్ విచారణలో అన్నీ వెలుగులోకి వస్తాయి.