Advertisementt

షాక్‌: డ్రగ్స్ స్కాండిల్‌లో టాలీవుడ్‌ టాప్‌ హీరో భార్య పేరు?

Tue 22nd Sep 2020 09:32 PM
namrata shirodkar,drug chats,jaya saha,drugs scandal,tollywood  షాక్‌: డ్రగ్స్ స్కాండిల్‌లో టాలీవుడ్‌ టాప్‌ హీరో భార్య పేరు?
Tollywood top Hero wife name in Drugs Scandal షాక్‌: డ్రగ్స్ స్కాండిల్‌లో టాలీవుడ్‌ టాప్‌ హీరో భార్య పేరు?
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నుండి శాండిల్‌వుడ్, టాలీవుడ్‌ని డ్రగ్స్ కేసు ఊపేస్తోంది. రియా చక్రవర్తి అరెస్ట్ అవడం మొదలు రాగిణి ద్వివేది, సంజనలు అరెస్ట్ కావడంతో ఈ డ్రగ్స్ కేసు రకరకాల మలుపులు తిరుగుతుంది. రియా చక్రవర్తి ఎప్పుడు ఎవరెవరి పేర్లు బయటపెడుతుందో అనే టెంక్షన్‌లో సినిమా జనాలు ఉన్నారు. రియా చక్రవర్తి టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ పేరు, బాలీవుడ్‌లో శ్రద్ద కపూర్, సారా అలీఖాన్‌ల పేర్లు బయటికి వచ్చాయి. రకుల్ కోర్టుకెళ్లి తన పేరు సాంఘీక మాధ్యమాల్లో రాకుండా చూడాలంటూ కోర్టుని వేడుకుంది. ఈ లోపు ఎన్సీబీ వాళ్ళు శ్రద్ద కపూర్‌కి, సారాకి సమన్లు జారీ చెయ్యడానికి రెడీ అయ్యేలోపు ఈ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బడా హీరోయిన్ దీపికా పదుకొనె పేరు బయటికి వచ్చింది.

ఆమె తన మేనేజర్ కరిష్మాతో మాల్ కావాలని చాట్ చేసినట్లుగా ఎన్సీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనితో దీపికకు సమన్లు పంపే యోచనలో ఎన్సీబీ ఉన్నట్లుగా సమాచారం. అసలే టాప్ స్టార్స్ పేర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నవేళ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ కూడా ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయినట్లుగా నేషన్ మీడియాలో వచ్చిన న్యూస్‌‌కి అందరూ షాకవుతున్నారు. నమ్రత శిరోద్కర్ బాలీవుడ్ వాళ్లతో డ్రగ్స్ విషయంలో చాటింగ్స్ చేసినట్లుగా.. ఎన్సీబీ దానిని డీ కోడ్ చేసినట్లుగా మీడియా టాక్. 

మరి రియా చక్రవర్తి అరెస్ట్, తర్వాత డ్రగ్ డీలర్లు, డ్రగ్ అమ్మేవాళ్ళని అరెస్ట్ చెయ్యడంతో పాటుగా.. ఈ కేసులో ఎవరూ వినని పేర్లు బయటికి రావడం షాకింగ్ విషయమనే చెప్పాలి. మరి మహేష్ వైఫ్ నమ్రత పేరు నేషనల్ మీడియాలో రావడం టాలీవుడ్‌ని షాక్‌కి గురి చేసింది.

Tollywood top Hero wife name in Drugs Scandal:

Namrata Shirodkar is ‘N’ in drug chats with Jaya Saha claims reports

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ