ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rumors on Director Nag Ashwin next Movie

ప్రభాస్ గ్యాప్ ఇచ్చాడు.. ఈ లోపు ఆ డైరెక్టర్ ఏమైనా?

Rumors on Director Nag Ashwin next Movie

ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ అవకుండానే నాగ్ అశ్విన్ భారీ పాన్ ఇండియా మూవీని ప్రకటించాడు. నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చోవడమే కాదు... ప్రభాస్ కోసం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేని కూడా ఎంపిక చేసి అధికారిక ప్రకటన చేసాడు. అయితే ప్రభాస్ - నాగ్ అశ్విన్ ముచ్చట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్చల్ చేసేటప్పుడే ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ.. డైరెక్ట్ హిందీ మూవీ ఆదిపురుష్ ప్రకటించి షాకిచ్చాడు. అయితే రాధేశ్యామ్ - నాగ్ అశ్విన్ మూవీ తర్వాతే ఆదిపురుష్ ఉంటుంది అనుకుంటే... ఓం రౌత్ ముందుగా ఆదిపురుష్‌నే ఫినిష్ చేసేలా వ్యవహరిస్తున్నాడు. నాగ్ అశ్విన్ మూవీ పక్కన బెట్టి ముందు ఆదిపురుష్‌కే ప్రభాస్ మొగ్గు చూపుతున్నాడు కూడా.

అయితే నాగ్ అశ్విన్ ప్రభాస్ స్క్రిప్ట్ పూర్తి చేసుకున్నాడట. ఇక ఎలాగూ ప్రభాస్ ఆదిపురుష్ గనక మొదలు పెట్టి తన సినిమాకి గ్యాప్ ఇస్తే.. ఈలోపు నాగ్ అశ్విన్ మరో చిన్న మూవీ ఏమైనా చేస్తాడా? అనే డౌట్ అందరిలో కలుగుతుంటే నాగ్ అశ్విన్ మాత్రం ఓ వెబ్ సీరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడట. అది బాలీవుడ్‌లో హిట్ అయిన లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. 

బాలీవుడ్‌లో నాలుగు ఎపిసోడ్స్‌ని నలుగురు డైరెక్టర్స్ తెరకెక్కించినట్టుగా.. తెలుగులోనూ నాలుగు ఎపిసోడ్స్‌కి నలుగురు దర్శకులు పనిచెయ్యబోతుంటే.. ఒక ఎపిసోడ్‌కి నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయబోతున్నాడట. ఈ వెబ్ సీరీస్ ఈ ఏడాది చివరికి పూర్తవుతుంది అని... దీనికోసం టాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారని వినికిడి. 

Prabhas and Nag Ashwin movie delay

prabhas
nag ashwin
delay
aadipurush
lust stories