Advertisementt

సందీప్ వంగా మళ్లీ మొదటికే వచ్చాడా..?

Mon 21st Sep 2020 11:10 PM
sandeep reddy vanga,arjun reddy,kabir singh,vijay devarakonda,shahidkapoor,bollywood  సందీప్ వంగా మళ్లీ మొదటికే వచ్చాడా..?
Sandeep wants to make small..? సందీప్ వంగా మళ్లీ మొదటికే వచ్చాడా..?
Advertisement
Ads by CJ

అర్జున్ రెడ్డి డైరెక్టర్ తెలుగులో సృష్టించిన సంచలనం తర్వాత బాలీవుడ్ లోనూ అంతే విజయాని ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగు సినిమా చరిత్రలో కల్ట్ మూవీగా నిలిచిపోయింది. ఇదే సినిమాని కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసారు. 300కోట్లకి పైగా వసూళ్లతో బాక్సఫీసు వద్ద కబీర్ సింగ్ సునామీ సృష్టించింది. షాహిద్ కపూర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

దాంతో సందీప్ బాలీవుడ్ లో సెటిల్ అయ్యాడనే అనుకున్నారు. అనుకున్నట్టుగానే కబీర్ సింగ్ నిర్మాతలే సెకండ్ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఐతే అన్నీ కుదిరాయి హీరో కూడా ఓకే అయ్యాడు సినిమా స్టార్ట్ అవుతుందని వార్తలు వచ్చాయి. రణ్ బీర్ కపూర్ హీరోగా సినిమా తెరకెక్కనుందని వినిపించింది. కానీ అలా వచ్చిన వార్తలేవీ నిజం కాలేదు. 

ఐతే తాజాగా సందీప్ వంగా నిర్ణయం తీసుకున్నాడని టాక్. తన తర్వాతి చిత్రంగా చిన్న సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడట. స్టార్ హీరోల కోసం వేచి చూడడం కంటే చిన్న హీరోతో చిన్న సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. ఈ మేరకు ప్రయత్నాలు మొదలెట్టాడని అంటున్నారు. ఈ చిత్రానికి సందీప్ వంగానే నిర్మాతగా ఉండనున్నాడట.

Sandeep wants to make small..?:

Sandeep wants to make small..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ