బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనని లైంగికంగా వేధించాడంటూ హీరోయిన్ పాయల్ ఘోష్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాయల్ మాటలు నిరాధారమైనవని చెప్తూ అనురాగ్ ట్విట్టర్ వేదికగా ఆరోపణల్ని ఖండించాడు. ఐతే అనురాగ్ కశ్యప్ తో పనిచేసిన వారు ఒక్కొక్కరుగా అతనికి మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. అతని మాజీ భార్యలు కూడా ఈ విషయంలో అనురాగ్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు.
ఐతే తాజాగా పాయల్ పాత ట్వీట్లు బయటపడ్డాయి. మీటూ ఉద్యమం అప్పుడో మరెపుడో గానీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందనే విషయమై ఆమె చేసిన ట్వీట్లని బయటకి తీసారు. ఆ ట్వీట్లలో ఈ విధంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ రేప్ చేయరు. నువ్వు కంఫర్టబుల్ గా కనిపించకపోతే నీ నుంచి ఏదో అడుగుతారు. అలాంటప్పుడు చప్పుడు చేయకుండా అక్కడి నుండి బయటకి వచ్చేయాలి. అంతే కానీ అనవసర డ్రామా క్రియేట్ చేయద్దు అని పోస్ట్ పెట్టింది.
అప్పుడు ఎవరి గురించి పెట్టిందో గానీ ఇప్పుడు తనకే రివర్స్ లో వచ్చి తాకింది. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్వీట్లని డిలీట్ చేయడం మర్చిపోయినట్టుంది అంటూ పాయల్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ట్వీట్లు, కామెంట్లపై పాయల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.