RRR మూవీలో కొమరం భీం పాత్రలో అదరగొట్టబోతున్న ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమాలో సూపర్ స్టైలిష్ బిజినెస్ మ్యాన్‌గా కనిపిస్తాడని ప్రచారం ఉంది. త్రివిక్రమ్ మూవీ తర్వాత ఎన్టీఆర్.. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మాణంలో నటించబోతున్నాడనే టాక్ ఉంది. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ మూవీ కాంబోపై అధికారిక ప్రకటన రాకపోయినా.. వాళ్ళ కాంబో ఫిక్స్ అంటున్నారు. కన్నడ దర్శకుడితో ప్రభాస్ మూవీ అంటున్నప్పటికీ... అది ఎన్టీఆర్ సినిమా తర్వాతే ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో కమిట్మెంట్ ఉందట.
అయితే తాజాగా ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ ఓ గ్యాంగ్ స్టర్‌గా కనిపించబోతున్నాడని.. బయోవార్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ మాఫియా డాన్ పాత్రలో సరికొత్త మేకోవర్‌తో ప్రశాంత్ నీల్ సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 2 షూట్‌తో పాటుగా ప్రశాంత్ నీల్ టీం ఎన్టీఆర్ గెటప్‌కు సంబంధించి వర్క్ కూడా చేస్తున్నారట.
ఎన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ ఒక పవర్ ఫుల్ మాఫియా డాన్‌గా చూపించబోతున్నాడనే న్యూస్ చూడగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం మొదలయ్యింది. కెజిఎఫ్‌లోని యష్(రాఖీభాయ్) పాత్రని తలదన్నేలా ఎన్టీఆర్ మేకోవర్ ఉండబోతుందట. మరి ఎన్టీఆర్ ఈ మాస్ పాత్రలో తన నటనతో దున్నేయ్యడం ఖాయమే.