Advertisementt

బోయపాటి.. ఇంకా వెతుకుతున్నాడు.

Sun 20th Sep 2020 11:10 PM
boyapati srinu,balayya,heroine,bb3,telugu  బోయపాటి.. ఇంకా వెతుకుతున్నాడు.
Boyapati, Still searching for Heroine.. . బోయపాటి.. ఇంకా వెతుకుతున్నాడు.
Advertisement
Ads by CJ

బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో వస్తున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి బాలయ్య అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఊరమాస్ గెటప్ లో పవర్ ఫుల్ డైలాగుతో టీజర్ ఆసాంతం ఆసక్తికరంగా ఉంది. ఐతే టీజర్ రిలీజై చాలా రోజులవుతుంది. సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయింది. అయినా కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారనేది మాత్రం ఇంకా వెల్లడి చేయలేదు.

కొత్త అమ్మాయి హీరోయిన్ గా కనిపిస్తుందంటూ వార్తలు వచ్చాయి కానీ వివరాలేమీ బయటకు రాలేదు. ఐతే తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బోయపాటి హీరోయిన్ కోసం వెతుకుతున్నాడని సమాచారం. ఈ మేరకు కొత్త వారిని ఆహ్వానిస్తున్నాడట. ఆడిషన్ నిర్వహించి హీరోయిన్ ని ఎంచుకోవాలని చూస్తున్నాడట.

కరోనా కారణంగా ఆరునెలలు షూటింగులు లేకుండా ఖాళీగా ఉన్న వాళ్లందరూ ఒక్కొక్కరుగా షూటింగులు మొదలు పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో బాలయ్య- బోయపాటి సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల తొందరగా హీరోయిన్ ని కన్ఫర్మ్ చేసేసుకుని షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారట.

Boyapati, Still searching for Heroine.. .:

Boyapati, Still  searching for Heroine..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ