బిగ్ బాస్ నాలుగవ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. రెండవ వారం పూర్తి చేసుకుని దూసుకుపోతున్న గేమ్ షో లో ఈ వారం రెండు ఎలిమినేషన్లు ఉన్నాయని నాగార్జున ప్రకటించారు. మొదటి ఎలిమినేషన్ గా కరాటే కళ్యాణిని హౌస్ నుండి బయటకు పంపేసారు. రెండవ ఎలిమినేషన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది ఉండగా సేఫ్ జోన్లోకి గంగవ్వ వెళ్ళిపోయింది.
మిగిలినవారిలో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు మొత్తం ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఈ ఏడుగురిలో ఎవరు హౌస్ నుండి బయటకు వెళ్ళనున్నారనేది రేపటితో తెలిసిపోతుంది. మొత్తం ఏడుగురిలో కుమార్ సాయి కి అంతగా ఓట్లు పడలేదని టాక్ వినిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
అందువల్ల ప్రేక్షకులని కనెక్ట్ కాలేకపోయాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో కుమార్ సాయి హౌస్ లోనుండి వెళ్తాడని ప్రచారం చేస్తున్నారు. కమెడియన్ అయిన కుమార్ సాయిపై అటు ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా మంచి నమ్మకం పెట్టుకున్నారు. ఐతే సినిమాల్లో కామెడీ చేసే వాళ్లందరూ బయట కుడా కామెడీగా ఉండాలన్న రూల్ లేదు. సో.. మరి రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.