Advertisementt

మళ్లీ వెనక్కొచ్చిన హెబ్బా పటేల్..

Sat 19th Sep 2020 07:47 PM
hebbah patel,kumari 21f,odela railway station,ashok  మళ్లీ వెనక్కొచ్చిన హెబ్బా పటేల్..
Hebbah Patel goes to back.. మళ్లీ వెనక్కొచ్చిన హెబ్బా పటేల్..
Advertisement
Ads by CJ

కుమారి 21ఎఫ్ సినిమాతో దూసుకువచ్చిన హెబ్బా పటేల్, తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుందని చాలా మంది అనుకున్నారు. కానీ కుమారి 21ఎఫ్ తర్వాత హెబ్బా చేసిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. అదీగాక కుమారి 21ఎఫ్ తరహా పాత్రలే రిపీట్ కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం హెబ్బా హీరోయిన్ గా ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమా తెరకెక్కుతోంది. సంపత్ నంది కథ అందించిన ఈ సినిమాని అశోక్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు.

ఐతే ఈ సినిమాలో హెబ్బా కొత్తగా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుండి హెబ్బా పటేల్ లుక్ బయటకి వచ్చింది. సాధారణ చీరలో అచ్చం పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుంది. పంట పొలాల్లో తిరుగుతూ కనిపించే అమ్మాయిగా హెబ్బా పటేల్ నటిస్తుంది. కుమారి తర్వాత ఇలాంటి పాత్రల్లో హెబ్బా కనిపించలేదు. తన మొదటి సినిమా అలా ఎలా లో పల్లెటూరి అమ్మాయిగా మెప్పించింది.

ఇప్పుడు ప్రస్తుతం మళ్లీ వెనక్కి వెళ్ళి మొదటి సినిమా మాదిరిపాత్రలో కనిపించనుంది. గ్లామర్ పాత్రల ద్వారా పెద్దగా గుర్తింపు రాని హెబ్బాకి ఓదెల రైల్వే స్టేషన్ తో అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి. హెబ్బా పటేల్ ఒకానొక హీరోయిన్ గా చేసిన ఒరేయ్ బుజ్జిగా చిత్రం అక్టోబర్ 2వ తేదీ నుండి ఆహాలో అందుబాటులో ఉండనుంది. రాజ్ తరుణ్ హీరోగా కనిపిస్తున్నాడు.

Hebbah Patel goes to back..:

Hebbah Patel goes to back..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ