ఈ ఏడాది కరోనా మహమ్మారి వలన సినిమా ఇండస్ట్రీ ఎన్నో వేల కోట్ల నష్టాల పాలైంది. సెట్స్ మీదున్న సినిమాలు, విడుదలకు నోచుకోని సినిమాలు, థియేటర్స్ బంద్, సినిమా కార్మికుల ఆకలి కేకలు అబ్బో సినిమా ఇండస్ట్రీని కరోనా అతలాకుతలం చేసేసింది. నిర్మాతలు ఘొల్లుమంటుంటే.. ప్లాప్ హిరోయిన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూసిన అవార్డ్స్ ఫంక్షన్స్ అన్ని కరోనా కారణంగా క్యాన్సిల్ అయ్యాయి. బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు జరగాల్సిన అవార్డ్స్ వేడుకలన్నీ కరోనా కారణంగానే మిస్ అయ్యాయి. మరి ప్లాప్స్‌లో ఉన్న హీరోయిన్స్ చాలామంది ఈ అవార్డ్స్ వేడుకలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. ఆ వేడుకలకి స్టైలిష్‌గా తయారై వెళ్ళడానికి ఒక కారణమైతే. స్టేజ్ డాన్స్‌లతోనే దర్శకనిర్మాతలు ఆకట్టుకోవాలని చూస్తుంటారు.
ప్రతి హీరోయిన్ అందమైన డ్రెస్‌తో, చాలా స్టైలిష్ హెయిర్ స్టైల్, హాట్ హాట్ అందాలతో ఫోటో గ్రాఫర్స్‌కి ఫోజులిస్తూ.. స్టేజ్ మీద ఆడుతూ పాడుతూ అందరిని మైమరపించే హీరోయిన్స్ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. ఈ ఏడాది కరోనా కారణంగా జరగాల్సిన ఫిలిం ఫేర్ అవార్డ్స్, ఆగష్టులో జరగాల్సిన సంతోషం అవార్డ్స్, సైమా అవార్డ్స్, విజయ్ అవార్డ్స్, టివి 9 - టీఎస్ఆర్ అవార్డ్స్, జీ సినీ అవార్డ్స్ అబ్బో చాలా అవార్డులు క్యాన్సిల్ అయ్యాయి.
అయితే తాజాగా సైమా వారు షార్ట్ ఫిలిం అవార్డ్స్ కండక్ట్ చేస్తాం అని.. అతి త్వరలోనే అంటూ అనౌన్స్ చేస్తున్నారు. మరి కరోనా కారణంగా క్యాన్సిల్ అయిన అవార్డు వేడుకలు మళ్ళీ మొదలైతే ప్లాప్ హీరోయిన్స్ ఇక పండగే.