Advertisementt

తెలుగు ఇండస్ట్రీనే టాప్.. కంగనా రనౌత్..

Sat 19th Sep 2020 07:27 PM
telugu film industry,kangana ranaut,bollywood  తెలుగు ఇండస్ట్రీనే టాప్.. కంగనా రనౌత్..
Telugu Film industry is the top in Nation తెలుగు ఇండస్ట్రీనే టాప్.. కంగనా రనౌత్..
Advertisement
Ads by CJ

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రతీ తెలుగు సినిమా అభిమానులని ఆనందంతో నింపేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, దేశంలోనే అతిపెద్ద ఫిలిమ్ సిటీని నోయిడాలో ఏర్పాటు చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, దేశంలో పెద్ద సినిమా ఇండస్ట్రీ అనగానే అందరూ హిందీ సినిమానే అనుకుంటారు.

కానీ నిజానికి తెలుగు సినిమా అందరికంటే టాప్ లో ఉంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అదీగాక చాలా వరకు బాలీవుడ్ చిత్రాలు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటాయని పోస్ట్ పెట్టింది. ఇంకా, దేశంలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలని ఒక దగ్గరికి తీసుకురావాలని, దానివల్ల హాలీవుడ్ ని తలదన్నే సినిమాలు ఇండియా నుండి వస్తాయని చెబుతుంది. 

బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమాలో కంగనా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇప్పటి వరకు కంగనా చేసిన తెలుగు సినిమా అదొక్కటే.

Telugu Film industry is the top in Nation:

Telugu Film industry is the top in Nation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ