పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి నాలుగైదు సినిమాలు చేసి ఎన్నికల్లో బిజీ అవుదామనుకుంటే కరోనా పవన్ ప్లానింగ్ పాడుచేసింది. ప్రస్తుతం కరోనా తగ్గాక వకీల్ సాబ్ పూర్తి చేస్తే చాలన్నట్టుగా ఉంది వ్యవహారం. అయితే పవన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఫిట్ నెస్ మీద శ్రద్ద తగ్గిపోయింది. కానీ సినిమాల విషయంలో పవన్ ఫిట్‌గా ఉంటేనే ఆయన హీరోయిజానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ పవన్ వకీల్ సాబ్ ఒప్పుకున్నాక కూడా ఫిట్ నెస్ మీద శ్రద్ద పెట్టలేదు. వకీల్ సాబ్ అంటే ఓకే ఎందుకంటే ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రకి కాస్త ఒడ్డుపొడుగు ఉంటేనే బావుంటుంది. మోషన్ పోస్టర్‌లో పవన్ లాయర్ స్టయిల్ బావుంది కూడా.
కానీ క్రిష్ సినిమాకి, హరీష్ శంకర్ సినిమాకి ఇలా బరువు పెరిగిన పవన్‌తో హీరోయిజం పండించాలంటే కుదరదు. ప్రస్తుతం లాక్ డౌన్‌లో చాతుర్మాస దీక్ష మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ బాగా బరువు పెరిగినట్టుగా అనిపిస్తుంది. వర్కౌట్స్ లేవు.. పవన్ ని జిమ్ చెయ్యమని ఒళ్ళు తగ్గించుకోమని చెప్పే సాహసం ఎవరూ చెయ్యరు. గెడ్డం, హెయిర్ పెంచాడు. బరువు పెంచాడు. మరి క్రిష్ సినిమాకి హరీష్, సురేందర్ రెడ్డి సినిమాలకు పవన్ ఫిట్ గా ఉండాలి. అందుకే దిల్ రాజు పవన్ కళ్యాణ్ కోసం ఓ ప్రత్యేకమైన జిమ్ ట్రైనర్ ని, లుక్ కోసం స్టైలిస్ట్ ని మాట్లాడాలని చూస్తున్నాడట. పవన్ చెవిన ఓ మాటేసి దిల్ రాజు ఈ పనులు చెయ్యాలని చూస్తున్నాడట.
ఇక క్రిష్, హరీష్ లు అనుకున్నా పవన్ వరకు విషయాన్ని చేర్చాలంటే తర్జనభర్జన పడుతున్నారట. మరి పవన్ ఎవరితో చెప్పించుకోకుండా తన ఫిట్ నెస్ మీద లుక్ మీద శ్రద్ద పెడితే బావుంటుంది. ఇది మా కోరిక కాదు... పవన్ ఫ్యాన్స్ కోరిక.