బాలయ్య బ్యాడ్ లక్ ఎందుకంటే బోయపాటి సినిమా ఈపాటికి పూర్తి చేసి మరో ప్రాజెక్ట్ ఓకే చేసేసే బాలయ్య కరోనా వలన ఆరు నెలల టైం వేస్ట్ చెయ్యాల్సి రావడమే కాదు.. ఇప్పుడు తన సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ కి సంప్రదించాలనుకున్న హీరోకి హెల్త్ పాడవడమే. అంటే బోయపాటి - బాలయ్య కాంబో మూవీ అంటే ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో.. ఏ రేంజ్ అంచనాలుంటాయో అందరికి తెలిసిందే. హీరోతో సమానమైన పాత్రలని బోయపాటి విలన్స్ కి రాస్తాడు. అలాంటి రోల్ కోసమే బోయపాటి - బాలయ్యలు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని సంప్రదించగా సంజయ్ దత్ కి క్యాన్సర్ బయటపడింది. సంజయ్ తో సంప్రదింపులు కూడా జరిగాయట. కానీ సంజయ్ కూడా ఎక్సపెక్ట్ చెయ్యని క్యాన్సర్ మహమ్మారి సంజయ్ దత్ ఒంట్లోకి ప్రవేశించింది.
అయినా క్యాన్సర్ ని భరిస్తూ ఆయన ఒప్పుకున్నా సినిమా షూటింగ్ కి ఆయన హాజరవుతున్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే సంజయ్ తనకు బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ పార్ట్స్ కంప్లీట్ చేస్తున్నాడు. బాలీవుడ్ మూవీ, అలాగే కన్నడ సంచలనం కెజిఎఫ్2 లో అధీరా పాత్రని సంజయ్ పూర్తి చేశాకే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లాలనుకుంటున్నాడట. అయితే తాజాగా సంజయ్ దత్, మాన్యతా దత్ లు పిల్లల్ని కలవడానికి దుబాయ్ వెళ్ళినట్టుగా సమాచారం.
ఇకపోతే బాలయ్య సినిమాలో సంజయ్ దత్ ని విలన్ గా అనుకున్నాక బోయపాటి నిశ్చింతగా ఉంటే.. ఇప్పుడు సంజయ్ దత్ ఆరోగ్యం బాగోకపోవడంతో మరో క్రేజీ విలన్ ని ఫైనల్ చేసే పనిలో టీం ఉందట. మరి సంజయ్ దత్ తో బాలయ్య పోరాడుతుంటే బాలయ్య ఫ్యాన్స్ విజిల్స్ వేసేవారు.. అందుకే బాలయ్య బ్యాడ్ లక్ అంది. అసలు బాలయ్య బ్యాడ్ లక్ అనేకన్నా బాలయ్య ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులే బ్యాడ్ లక్ అనాలి.