Advertisementt

వకీల్ సాబ్ నుండి వచ్చే అప్డేట్ అదే...?

Fri 18th Sep 2020 09:16 PM
vakeel saab,pawan kalyan,dil raju,second single,venu sriram  వకీల్ సాబ్ నుండి వచ్చే అప్డేట్ అదే...?
An update from vakeell Saab is..? వకీల్ సాబ్ నుండి వచ్చే అప్డేట్ అదే...?
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో అభిమానులకి చాలా ఆసక్తిగా ఉంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఎమ్ సీ ఏ ఫేమ్ వేణు  శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా లేకపోయుంటే ఈ పాటికి సినిమా రిలీజై అభిమానులకి షుషారు కలిగించేది. 

కానీ కరోనా కారణంగా చిత్రీకరణ నిలిచిపోయి విడుదల తేదీ మారిపోయింది. ప్రస్తుతం థియేటర్లు ఇంకా తెరుచుకోనందున సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ వెండితెర మీదకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వకీల్ సాబ్ సినిమా నుండి ఒక పాటతో పాటు మోషన్ పోస్టర్ రిలీజైంది. సో.. అభిమానులు ఈ సినిమా నుండి మరో అప్డేట్ రావాలని కోరుకుంటున్నారు. 

అందుకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు కూడా. ఐతే ఆ ఎదురుచూపులు ఫలించనున్నాయి. మరికొద్ది రోజుల్లో వకీల్ సాబ్ సినిమా నుండి అప్డేట్ రానుంది. ఈ చిత్రం నుండి మరో పాటని రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతుంది. పాట రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి గానీ ఎప్పుడనే విషయంలో మాత్రం క్లారిటీ రావట్లేదు. సో.. అభిమానులు వెయిట్ చేయాల్సిందే.

An update from vakeell Saab is..?:

An update from vakeell Saab is..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ