నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన వి చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు ఓటీటీ ద్వారా తెలుగులో రిలీజ్ అయిన పెద్ద సినిమా అంటే ఇదే. అందుకే వి సినిమాకి ఓ రేంజ్ లో ప్రమోషన్ చేసారు. టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వం వహించిన వి సినిమాపై అల్లు శిరిష్ తనదైన కామెంట్లు చేసాడు.
వి సినిమాని పొగిడిన శిరీష్, థియేటర్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయ్యాం అన్నాడు. నాని నటన అద్భుతం అనీ, క్లిష్టమైన పాత్రలో నాని మెప్పించిన తీరు బాగుందని ప్రశంసించాడు. సుధీర్ బాబు చాలా బాగా కనిపించాడని, యాక్షన్ సీన్లలో గాయపడ్డ వీడియోలు తాను చూసానని, అయినా కూడా తొందరగా రికవరీ అయ్యి సినిమా కోసం పనిచేయడం గ్రేట్ అనీ, సుధీర్ బాబు అంకితభావం తనకి స్ఫూర్తినిస్తుందని పోస్ట్ పెట్టాడు.
దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నివేథా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లు గా కనిపించారు. పాటలు అమిత్ త్రివేది చేయగా, నేపథ్య సంగీతాన్ని థమన్ సమకూర్చాడు.