Advertisementt

ఉపేంద్ర.. మళ్ళీ మెగా హీరో సినిమాలో..

Fri 18th Sep 2020 03:41 PM
varun tej,upendra,vt10,kiran korrapati  ఉపేంద్ర.. మళ్ళీ మెగా హీరో సినిమాలో..
Kannada Star coming to Telugu.. ఉపేంద్ర.. మళ్ళీ మెగా హీరో సినిమాలో..
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్ గా మెప్పించిన ఉపేంద్ర, ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. గత కొన్ని రోజులుగా ఉపేంద్ర తెలుగు సినిమాలో నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆ వార్తలన్నీ నిజమయ్యాయి. తాజాగా ఈ విషయమై చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నాడు. 

ఈ మేరకు ఉపేంద్ర పుట్టినరోజుని పురస్కరించుకుని చిత్ర బృందం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానం పలికింది. వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో ఉపేంద్ర కూడా భాగం అయ్యాడు. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత మళ్ళీ తెలుగులో నటించబోతున్న ఉపేంద్ర, మెగా సినిమా ద్వారానే తెరమీదకి రావడం విశేషం.

కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా కొత్తగా కనిపిస్తాడట. ఇప్పటికే బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. లాక్డౌన్ టైమ్ లో ఫిట్నెస్ పెంచుకుని మరికొద్ది రోజుల్లో మొదలవబోయే షూట్ కి రెడీ అవుతున్నాడు. అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ, ఈ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్ గా కనిపిస్తుందని సమాచారం.

Kannada Star coming to Telugu..:

Kannada Star coming to Telugu..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ