Advertisementt

మోసగాళ్ళు మోషన్ పోస్టర్... థ్రిల్లింగ్..

Fri 18th Sep 2020 03:14 PM
mosagallu,manchu vishnu,kajal agarwal,sunil shetty  మోసగాళ్ళు మోషన్ పోస్టర్... థ్రిల్లింగ్..
Rise Of Mosagallu.. Thrilling మోసగాళ్ళు మోషన్ పోస్టర్... థ్రిల్లింగ్..
Advertisement
Ads by CJ

మంచు విష్ణు కెరీర్లో గుర్తుండిపోయే నిలిచిపోతుందని చెప్పబడుతున్న మోసగాళ్ళు చిత్రం నుండి మోషన్ పోస్టర్ రిలీజైంది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఒకానొక ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి సునీల్ శెట్టి లుక్ తో పాటు కాజల్ లుక్ కూడా రివీలైంది. తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతుంది. 

డాలర్ నోటు మీద మోసగాళ్ళు అనే టైటిల్ పడుతూ బ్యాగ్రౌండ్ లో అద్భుతమైన సంగీతంతో, చూస్తుంటే థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి థ్రిల్లర్ గా వస్తుందని అర్థమవుతుంది. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ అన్నాచెల్లెళ్ళు గా కనిపిస్తున్న ఈ సినిమా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. ముందుగా తెలుగు వెర్షన్ పూర్తయ్యాక ఇంగ్లీషులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెఫ్రీ గిన్ చీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Rise Of Mosagallu.. Thrilling:

Rise Of Mosagallu.. Thrilling

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ