అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అఖిల్ బాగా నమ్మకంగా ఉన్నాడు. ఇప్పటివరకు సక్సెస్ చూడని అఖిల్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ తో విజయం అందుకుంటాడని అక్కినేని అభిమానులు అనుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతం అందించాడు.
ఆల్రెడీ రిలీజైన మనసా మనసా పాటకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెలోడీ ట్రాక్ గా సాగిపోయిన ఈ పాట సంగీత ప్రియుల్ని బాగా ఆకర్షించింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. కోవిడ్ కారణంగా ఆరు నెలల పాటు నిలిచిపోయిన షూటింగ్ మళ్ళీ మొదలైంది. సెట్లో హీరోయిన్ పూజా హెగ్డే కనిపించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వచ్చాయి. పూజా ఫోటో కనిపించగానే అఖిల్ ఎక్కడ అంటూ కామెంట్లు పెట్టారు.
వారికోసమే అన్నట్టుగా నేడు పూజా హెగ్డే, అఖిల్ కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ తీస్తున్నారట. కోవిడ్ నియంత్రణల మధ్య అన్ని జాగ్రత్తలి పాటిస్తూ చిత్ర షూటింగ్ జరుగుతోందని చిత్ర బృందం ప్రకటించింది.