బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచి, ప్రపంచ సినిమాకి తెలుగు సినిమా రుచి చూపించిన దర్శకుడు రాజమౌళి, ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాని తెరమీదకి తీసుకొస్తున్నాడు. బాహుబలి సినిమాతో సంచలనం సృష్టించిన రాజమౌళీ, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలని తీసుకుని తన మనోఫలకంపై రాసుకున్న కథని వెండితెరకి తీసుకొస్తున్నాడు.
కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఈ నేపథ్యంలో చిత్రీకరణకి ప్లాన్స్ జరుగుతున్నాయని సమాచారం. ఐతే తాజాగా రాజమౌళి తన మొక్కు తీర్చుకున్నాడు. ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న రాజమౌళి కుటుంబం, మొక్కు తీర్చుకోవడానికి బయటకి వచ్చింది. కర్ణాటకలోని చామరాజపురంన్ జిల్లాలో ఉన్న హిమవద్ గోపాల స్వామిని దర్శించుకుని పూజలో పాల్గొన్నాడు. రాజమౌళి, ఆయన సతీమణీ రమాగారు ఈ పూజలో పాల్గొన్నారు.