ఈటీవీలో గత ఎనిమిదేళ్లుగా తిరుగులేని కామెడీ షో ఏదయ్యా అంటే వెంటనే జబర్దస్త్ అంటారు. నిజంగానే ఆ షో ని మట్టికరిపిద్దామనుకుని.. తర్వాతా చాలా షోస్ చతికిల పడినాయి. అయితే జబర్దస్త్‌లో కమెడియన్స్ అక్కడ పేరు, క్రేజు సంపాదించక వెండితెర మీద వెలిగిపోతున్నారు. కొంతమంది హీరోలుగాను మారారు. ఇక జబర్దస్త్ అంటే అమ్మో చాలా పెద్ద షో అక్కడ భారీ పారితోషకాలుంటాయి. అక్కడ ఛాన్స్ వస్తే ఓ కొత్త ఇల్లు, కొత్త కారు కొనెయ్యడమనే భ్రమలో చాలామంది ఉంటారు. నిజంగానే అందులో పనిచేసే కమెడియన్స్ అంతా జబర్దస్త్ చేశాకే కొత్త ఇల్లు, కార్లు కొని తిరుగుతున్నారు. నాగబాబు చేతుల మీదుగానే ఎన్నో గృహ ప్రవేశాలు జరిగాయి. అందుకే జబర్దస్త్ అంటే క్రేజుకి క్రేజు, డబ్బుకి డబ్బు అని చాలామంది కళలు కంటుంటారు.
జబర్దస్త్‌లో పనిచేసే సుధీర్, ఆది, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళకి ఎపిసోడ్‌కి లక్షల్లో పారితోషకాలు తీసుకుంటున్నారనే టాక్ ఉంది. ఎప్పటికప్పుడు జబర్దస్త్ పారితోషకం విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా జబర్దస్త్ పారితోషకాలు అందరూ ఆనుకున్నట్టుగా లక్షల్లో లేవట. జస్ట్ ఇమేజ్ పెంచుకోవడానికి అందులో పనిచేసే కమెడియన్స్ అలా చెప్పుకు తిరుగుతుంటారట. అంతా బిల్డప్ కోసం కమెడియన్స్ మా పారితోషకాలు లక్షల్లో అని చెప్పడం వెనుక ఓ పెద్ద కథే ఉందట. జబర్దస్త్‌లో కామెడీ చేసే వారు విదేశాల్లోనూ స్టేజ్ షోస్ ద్వారా ఆదాయం సంపాదించడమే కాదు... ఇక్కడ ఛానల్స్ లో స్పెషల్ షోస్ కి అడిగినప్పుడు జబర్దస్త్ పారితోషకాలు లెక్కలు బయటపెట్టి.. ఆ షోస్‌కి అదనంగా దండుకోవడానికి జబర్దస్త్ కమెడియన్స్ పారితోషకాలను హైక్ చేసి చెబుతుంటారట.
ఇదంతా జబర్దస్త్‌లో పనిచేసే ఓ చిన్న కమెడియన్ చెప్పిన మాటలే. అక్కడ లక్షల్లో పారితోషకాలు ఉండడం అనేది అంతా బిల్డప్పే అని, కొంతమందికి ఎపిసోడ్‌కి ఇంత అని, టీం లీడర్స్‌కి ఎక్కువ పారితోషకాలుంటే.. అందులో పనిచేసే టీం సభ్యులలో కొంతమందికి ఎపిసోడ్‌కి 10 వేల చొప్పున... ఇంకొంతమంది చిన్న వారికైతే 2500 ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయట. మరి జబర్దస్త్ అంటే అబ్బో అని చెప్పేదంతా చూస్తే హంబక్కే అనిపించడం లేదు.