Advertisementt

కరోనా ఎఫెక్ట్: అందరి చూపు సంక్రాంతిపైనే!

Fri 18th Sep 2020 02:28 PM
corona effect,tollywood,movies,vijaya dasami race,sankranthi  కరోనా ఎఫెక్ట్: అందరి చూపు సంక్రాంతిపైనే!
Corona Effect: Stars eye on Sankranthi కరోనా ఎఫెక్ట్: అందరి చూపు సంక్రాంతిపైనే!
Advertisement
Ads by CJ

ఎప్పుడూ దసరాకి సినిమాల హడావిడి మాములుగా ఉండేది కాదు. భారీ సినిమాల దగ్గరనుండి చిన్న చితక సినిమాల వరకు దసరా సెలవులని టార్గెట్ చేసేవి. ఏపీ, తెలంగాణలలో దసరా సెలవలు ఎలా లేదన్నా 15 రోజులుంటాయి. పిల్లలు ఖాళీ కాబట్టి పేరెంట్స్‌కి కూడా వారిని సినిమాకి తీసుకెళ్లక తప్పని పరిస్థితి. అందుకే పెద్ద సినిమాలు ఎక్కువగా దసరానే టార్గెట్ చేస్తుంటాయి. కానీ ఈ దసరా మాత్రం కరోనా కాలంలో కొట్టుకుపోయింది. సినిమాలన్ని ఇప్పుడు దసరా పండగ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. థియేటర్స్ దసరాకి ఓపెన్ చేస్తారనే న్యూస్ ఉన్నప్పటికీ.. కరోనాతో ఎంతమంది థియేటర్స్‌కి వస్తారో తెలియదు. అందులోనూ థియేటర్స్ ఓపెన్ చేసినా ఆక్యుపెన్సీ ఉండదు. కరోనా టైం లో థియేటర్స్ ని మాటిమాటికి శానిటైజ్ చేసి శుభ్రంగా ఉంచాలంటే తలకు మించిన భారం.

అందుకే ఇప్పుడు చాలామంది దర్శకనిర్మాతలు అంటే కరోనా టీకా వచ్చే వరకు ఆగలేనివారు తమ సినిమాలను ఓటిటికి బేరం పెడుతున్నారు. కానీ మా సినిమా ఎలాగైనా థియేటర్స్‌లో విడుదల చేద్దామనుకునేవారు మాత్రం సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. దసరా వదిలి వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి ఎన్ని సినిమాలు పోటీ ఉన్నా లెక్క చెయ్యం మేము మాత్రం థియేటర్స్‌లో వస్తామంటున్నారు. ఎలాగూ డిసెంబర్ కల్లా కరోనా వ్యాక్సిన్ విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. దానితో ప్రేక్షకులు భయం లేకుండా బయటకు వస్తారు. అందుకే దసరా ని పక్కనపడేసి ఇప్పుడు అందరూ సంక్రాంతే ముద్దు అంటున్నారు. 

సో వచ్చే సంక్రాతి సినిమాల హడావిడి మాత్రం ఓ రేంజ్ లోనే ఉండబోతుంది. ఇక సంక్రాంతి బరి అనే మాట వింటున్నది మాత్రం నితిన్ రంగ్ దే, పవన్ వకీల్ సాబ్, తమిళంలో విజయ్ ‘మాస్టర్’ సినిమాలతో పాటు అప్పటికి ఇంకెన్ని లిస్ట్‌లోకి వస్తాయో చూడాలి.

Corona Effect: Stars eye on Sankranthi:

Corona Effect: No movie in Vijaya Dasami Race

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ