Advertisementt

సింగిల్ సిట్టింగ్‌లో ప్లాప్ దర్శకుడికి చిరు ఛాన్స్!

Fri 18th Sep 2020 02:20 PM
meher ramesh,chiranjeevi,movie,latest,update  సింగిల్ సిట్టింగ్‌లో ప్లాప్ దర్శకుడికి చిరు ఛాన్స్!
Meher Ramesh and Chiranjeevi Project Latest Update సింగిల్ సిట్టింగ్‌లో ప్లాప్ దర్శకుడికి చిరు ఛాన్స్!
Advertisement
Ads by CJ

చిరు కోసం టాప్ డైరెక్టర్స్ సినిమాలు చేయడానికి తహతహలాడుతుంటే.. చిరు మాత్రం ఏరి కోరి ప్లాప్ దర్శకులకి అవకాశం ఇస్తున్నాడు. ప్లాప్ కాదు అట్టర్ ప్లాప్ దర్శకులకి చిరు అవకాశం ఇవ్వడంతో ఫాన్స్ బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం టాప్ దర్శకుడు కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్న చిరు తర్వాత సాహో డైరెక్టర్ సుజిత్ తో లూసిఫెర్ రీమేక్ అన్నా అది ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. ఇక దర్శకుడు బాబీతో ఓ సినిమాకి, ప్లాప్ దర్శకుడు మెహెర్ రమేష్ తో మరో మూవీకి చిరు కమిట్ అయ్యాడు. మెహెర్ రమేష్ చిరంజీవిని తమిళ వేదాళం రీమేక్ లో చూపించబోతున్నాడు. మెహెర్ రమేష్‌తో చిరు సినిమా అనగానే అందరిలో ఎక్కడలేని అనుమానాలు.

కానీ చిరు మాత్రం మెహెర్ రమేష్ చెప్పిన స్క్రిప్ట్ ని సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేసేశాడనే న్యూస్ ఫిలింనగర్ ని షేక్ చేస్తుంది. వేదాళం రీమేక్ చేస్తే చిరుతోనే చేయాలని మెహెర్ రమేష్ కంకణం కట్టుకుని మూడేళ్ళగా వేదాళం రీమేక్ స్క్రిప్ట్ పైనే కూర్చున్నాడట. తెలుగు నేటివిటికి ఆనుగుణంగా స్క్రిప్ట్ లో మార్పులు చేసి చిరుని కలవగా చిరు కూడా వేదాళం రీమేక్ స్క్రిప్ట్‌కి పడిపోయాడట. 

సింగిల్ సిట్టింగ్‌లో స్క్రిప్ట్ ఓకే చేసిన చిరు ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదట. తాజాగా ఫుల్ స్క్రిప్ట్ తో మెహెర్ చిరు ముందుకు వెళ్లగా.. మెహెర్ చెప్పిన ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఫై చిరుకి నమ్మకం కుదిరి.. మెహెర్ చెప్పినట్టుగా వేదాళం సినిమాలో ఓ కీలకమైన సీన్ కోసం చిరు గుండు మేకప్ వేసుకుని ఫోటో షూట్ కూడా చేసేసాడట. మరి చిరు గుండు స్టోరీ సోషల్ మీడియాలో అందరికి తెలిసిన విషయమేగా..

Meher Ramesh and Chiranjeevi Project Latest Update:

Chiranjeevi and Meher Ramesh movie on Cards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ