Advertisementt

బిగ్ బాస్ 4.. కంటెస్టెంట్స్‌కి రోజుకి ఎంతంటే?

Thu 17th Sep 2020 07:54 PM
bigg boss 4,contestants,remuneration,laasya,amma rajasekhar,monal  బిగ్ బాస్ 4.. కంటెస్టెంట్స్‌కి రోజుకి ఎంతంటే?
Bigg Boss 4 Telugu Contestants remuneration details బిగ్ బాస్ 4.. కంటెస్టెంట్స్‌కి రోజుకి ఎంతంటే?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 4 లో హౌస్‌లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఎవరూ పెద్దగా క్రేజ్ ఉన్నవాళ్లు లేరు. సీజన్ 4 కి అదే పెద్ద మైనస్. అయితే ఈ సీజన్లో లాస్య, నోయెల్, అమ్మ రాజశేఖర్ లాంటి వాళ్ళు తప్ప మిగతా వారినెవరు పెద్దగా చూసింది లేదు.. అలాంటిది ఈ షో ఎలా 100 రోజులు గడుస్తుందో అందులోని.. సోమవారం ఎలిమినేషన్స్ విషయంలో ఇంటి సభ్యులంతా బుర్ర లేకుండా ఎవరికీ వారు త్యాగం చేసుకుని ఎలిమినేషన్స్ కి వెళ్లారు. ఎవరిని ఎలిమినేట్ చేసిన హర్ట్ అవుతారంటూ బిగ్ బాస్ గేమ్‌ని సేఫ్‌గా ఆడేస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ పారితోషకాల మీద బయట పెద్ద చర్చే నడుస్తుంది.

కొద్దిగా ఫేమ్ ఉన్న యాంకర్ లాస్య, అమ్మ రాజశేఖర్‌లకి రోజుకి లక్ష చొప్పున ఫిక్స్ చేసిందట బిగ్ బాస్ యాజమాన్యం. ఇక నోయెల్‌కి హీరోయిన్ మోనాల్‌కి రోజుకి 50 వేల చొప్పున ఫిక్స్ చెయ్యగా గంగవ్వ, టివి 9 యాంకర్ దేవికి, కరాటే కళ్యాణి, హీరోయిన్ దివికి, హీరో అభిజిత్‌కి రోజుకి 25 వేల చొప్పున మిగతా కంటెస్టెంట్స్‌కి రోజుకి 10 వేల చొప్పున ఫిక్స్ చేశారట. 

మరి యాంకర్ లాస్య, అమ్మ రాజశేఖర్‌‌లు షోలో 100 రోజులుంటే 1 కోటి పట్టుకెళ్తారు. అలాగే బిగ్ బాస్ విన్ అయితే అదనంగా మరో 50 లక్షలన్నమాట. మరి లాస్య, అమ్మ రాజశేఖర్‌లు 100 రోజులుంటారా? లేదా అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఇక నోయెల్, దివి, దేవి లాంటి వాళ్ళు ఎక్కువ రోజులు షోలో ఉంటే పెద్ద మొత్తం అందుకుంటారని అంటున్నారు. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్‌కి క్వారంటైన్‌లోను స్టార్ మా పారితోషకాలు చెల్లించింది అనే టాక్ ఉంది. 

Bigg Boss 4 Telugu Contestants remuneration details:

Highest remuneration to Laasya and Amma Rajasekhar in bigg boss 4

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ