Advertisementt

అల్లుడు వచ్చేది దసరాకే..?

Wed 16th Sep 2020 10:15 PM
bellamkonda srinivas,alludu adhurs,santhosh srinivas  అల్లుడు వచ్చేది దసరాకే..?
Alludu Coming to Dasara Festival..? అల్లుడు వచ్చేది దసరాకే..?
Advertisement
Ads by CJ

అల్లుడు శీను సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్, ఆ సినిమాతో ఓ మోస్తారు విజయం అందుకున్నాడు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత కథానాయికగా కనిపించింది. ఐతే అల్లుడు శీను తర్వాత చేసిన సినిమాలెవీ పెద్దగా విజయాలని అందుకోలేవు. జయ జానకి నాయకి ఫర్వాలేదనిపించింది. రాక్షసుడు సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో మంచి హిట్ గా నిలిచింది.

ఐతే ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ అనే చిత్రంతో వస్తున్నాడు. అల్లుడు సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎనభైశాతానికి పైగా పూర్తయిందట. కరోనా కారణంగా నిలిచిపోయిన చిత్రీకరణ మళ్లీ మొదలుకానుంది. చివరి షెడ్యూల్ లో త్వరత్వరగా చిత్రీకరణ పూర్తి చేసుకుని దసరా కానుకగా అల్లుడు అదుర్స్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. అప్పటి వరకూ థియేతర్లు తెరుచుకుంటాయని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి అనుకున్నట్టుగా అల్లుడు దసరాకి వస్తాడా లేదా చూడాలి.

Alludu Coming to Dasara Festival..?:

Alludu Coming to Dasara Festival..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ