ఓటీటీ.. ఓవర్ ద టాప్. కరోనా కారణంగా ఓటీటీలు థియేటర్లకి ప్రత్యామ్నాలుగా మారాయి. ఐదున్నర నెలలుగా థియేటర్లు మూతబడిపోవడంతో ఓటీటీ వేదిక ద్వారానే సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ కాలం గడుపుతున్నారు. థియేటర్ అనుభవం ఓటీటీ ఇవ్వకపోయినా, కొత్త సినిమాలు, కొత్త కంటెంట్లపై ఉన్న ఆసక్తి ప్రేక్షకులని అటు వైపు నడిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓటీటీలకి డిమాండ్ బాగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా వ్యాపార సంస్థలు ఓటీటీ బిజినెస్ పై కన్నేసాయి. తెలుగు నిర్మాత అల్లు అరవింద్ ఆహా వేదికని స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నాడు. వందశాతం తెలుగు కంటెంట్ అందిస్తున్న ఈ యాప్ కి సబ్ స్క్రయిబర్స్ బాగానే పెరిగారు.
ఐతే తెలుగులో మరో ఓటీటీ వేదిక మొదలవుతుందని సమాచారం. ఈటీవీ రామోజీరావు గారు ఓటీటీ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నారని అంటున్నారు. ఓటీటీ మొదలు పెట్టడానికి కావాల్సిన కంటెంట్ ఈటీవీ వద్ద ఉండడం, అవి ఇతర ఛానెళ్లలో గానీ, మరెక్కడా అందుబాటులో ఉండకపోవడం వల్ల వాటన్నింటినీ ఓటీటీ వేదిక ద్వారా ప్రేక్షకులకి అందుబాటులో తీసుకురానున్నారట. అంతే కాదు కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లని ప్లాన్ చేస్తున్నారట. మరి కొద్ది రోజుల్లో ఈ ఓటీటీ వేదిక వచ్చేస్తోందని వినపిస్తుంది.