Advertisementt

నిఖిల్.. ఆ సినిమానే మొదలెడతాడు..

Tue 15th Sep 2020 11:08 PM
nikhil,18 pages,sukumar,palnati suryapratap  నిఖిల్.. ఆ సినిమానే మొదలెడతాడు..
Nikhil will start that film.. నిఖిల్.. ఆ సినిమానే మొదలెడతాడు..
Advertisement
Ads by CJ

కరోనా కారణంగా ఐదున్నర నెలలు సినిమా చిత్రీకరణకి బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా సినిమా షూటింగులు మొదలవుతున్నాయి.  చిన్న, పెద్ద హీరోలందరూ రెడీ అవుతున్నారు. ఐతే హీరో నిఖిల్, ఏ సినిమాని మొదలెడతాడనేది కన్ఫ్యూజన్ గా మారింది. అర్జున్ సురవరం తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా మొదలెట్టాడు. దీనిపై కాన్సెప్ట్ వీడియో కూడా రిలీజ్ చేసారు. 

లాక్డౌన్ తర్వాత కార్తికేయ 2 సెట్స్ మీదకి వెళ్ళనుందని అన్నారు. కానీ సడెన్ గా ఇక్కడే ట్విస్ట్ పడింది. కార్తికేయ 2 సినిమా తెరకెక్కించనున్న దర్శకుడు చందూ మొండేటి హీరోయిన్ నివేథా పేతురాజ్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియంటెడ్ సినిమా మొదలెట్టాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ ఈరోజే ప్రారంభమైంది. 

దీంతో చందు మొండేటి కార్తికేయ2 సినిమాని పక్కన పెట్టేసినట్లే అనిపిస్తోంది. అందువల్ల నిఖిల్ తన తర్వాతి చిత్రంగా 18పేజెస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడని భావిస్తున్నారు. ఐతే బడ్జెట్ కారణాల వల్లనే కార్తికేయ2 ని ఆపేసి కొత్త చిత్రాన్ని మొదలెడుతున్నాడని అనుకుంటున్నారు.

Nikhil will start that film..:

Nikhil will start that film..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ