హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం.. సీటీమార్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ కి సీటీమార్, మంచి హిట్ ఇస్తుందనే నమ్మకం గట్టిగా ఉంది. కరోనా కారణంగా నిలిచిపోయిన చిత్ర షూటింగ్ మళ్లీ రీస్టార్ట్ అయ్యింది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్, ఆంధ్ర మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా కనిపిస్తున్నారు.
ఇటు తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా కనిపించనుంది. ఐతే లాక్డౌన్ వల్ల చాలా సమయం దొరికినందున సీటీమార్ స్క్రిప్టులో పలు మార్పులు జరిగాయట. ముఖ్యంగా కామెడీ కంటెంట్ పెంచినట్లు తెలుస్తుంది. తమన్నాకి అసిస్టెంట్ గా కోచ్ గా చేస్తున్న వెన్నెల కిషోర్ నవ్వుల పువ్వులు పూయిస్తాడని అంటున్నారు. తమన్నా, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని వినబడుతోంది.
కామెడీని పండించడంలో వెన్నెల కిషోర్ సిద్ధ హస్తుడు. మరి అసిస్టెంట్ గా కోచ్ గా ఎలా నవ్విస్తాడో చూడాలి. విశేషమేంటంటే, తమన్నాకి అసిస్టెంట్ గా వెన్నెల కిషోర్ నటిస్తుంటే, గోపీచంద్ కి అసిస్టెంట్ గా కమెడియన్ సునీల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.