ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయిన దగ్గరనుండి అందరిలో అనాశక్తే. ఎందుకంటే హౌస్‌లో తెలిసిన మొహాలు లేకపోవడం, నాగార్జున హోస్టింగ్‌లో పస లేకపోవడం, ఇక హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ గేమ్‌ని సేఫ్ గేమ్‌గా ఆడడం ఇలా అందరిలో షో మీద విరక్తి పెంచేలా చేస్తుంది. తాజాగా ఎలిమినేషన్స్ విషయంలోనూ అందరిలో ఇదే చర్చ. సూర్య కిరణ్ ఈ సీజన్ మొదటి ఎలిమినేటర్. అలాగే యాంకర్ లాస్య ఈ సీజన్ మొదటి హౌస్ కెప్టెన్. అయితే ఈ సీజన్‌కి అందరూ తెలియని మొహాలని తీసుకున్న బిగ్ బాస్ యాజమాన్యం షో మీద క్రేజ్ పెంచే క్రమంలో 62 ఏళ్ళ గంగవ్వని తీసుకొచ్చారు. గత ఏడాది నుండి గంగవ్వ సినిమాల విషయంలో అక్కడక్కడా హైలెట్ అవుతూ రావడంతో, పెద్దావిడని తీసుకుంటే షోకి క్రేజ్ పెరుగుతుంది అని ఆవిడని తీసుకొచ్చిన యాజమాన్యం ఆవిడని బాగా చూసుకోమంటూ పదే పదే చెప్పడం చూస్తే ఆమెని బలవంతాన హౌస్‌లోకి పంపారా అనిపించకమానదు.
ఇక ఆవిడా ఈ వయసులో టాస్క్ చెయ్యలేదు, పని చెయ్యలేదు, ఏదో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పొద్దు పొద్దున్నే వర్కౌట్స్‌తో మెప్పిస్తుంది. అంటే గంగవ్వ చేసే పని ఇదే. అయితే నాగార్జున గత శనివారం బిగ్ బాస్ ఇంట్లో ఎలా ఉంది అంటే..
మంచిగానే ఉంది కానీ.. నాకు నిద్ర పట్టడం లేదు.. నేను పోతాను.. నన్ను పంపండి.. నాకు నా మనవలతో ఆడుకోవాలని ఉంది అంటూ అడిగినా నాగ్ మాత్రం కుదరదు ఉండాల్సిందే... మీరు బిగ్ బాస్ చెప్పేవరకు హౌస్‌లో ఉండాలని చెప్పాడు. ఇక మొదటి ఎలిమినేషన్‌లో గంగవ్వ పేరు ఉన్న ఆమెకి ఓట్ల విషయంలో నెటిజెన్స్ నుండి సింపతీ క్రియేట్ అయ్యి మిగతా కంటెస్టెంట్స్‌కి ఓట్లు చీలేల చేసింది. అంటే గంగవ్వ ఎన్నిసార్లు ఎలిమినేషన్‌కి వచ్చినా సేఫ్ అవడం పక్కా. కానీ గంగవ్వ నాకు ఇక్కడ నచ్చలేదు నేను పోతా అంటున్నా బిగ్ బాస్ మాత్రం కుదరదంటున్నాడు. చూద్దాం ఈ సీజన్‌లో కొత్తగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన బస్ స్టాప్ ఫేమ్ కుమార్ సాయి అయినా ఏమన్నా ఎంటర్టైన్ చేస్తాడేమో.