Advertisementt

బాలయ్య- బోయపాటి కాంబో.. టైటిల్ వచ్చేది ఆరోజే..?

Sun 13th Sep 2020 10:42 PM
balayya,boyapati,thaman,miryala ravinder reddy  బాలయ్య- బోయపాటి కాంబో.. టైటిల్ వచ్చేది ఆరోజే..?
Balayya- Boyapati movie Title will reveal on.. బాలయ్య- బోయపాటి కాంబో.. టైటిల్ వచ్చేది ఆరోజే..?
Advertisement
Ads by CJ

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా అనగానే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫస్ట్ గ్లింప్స్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమైంది. బోయపాటి మరోమారు బాలయ్యతో హిట్ కొడతాడని బలంగా నమ్ముతున్నారు. ఐతే ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ లాక్డౌన్ కంటే ముందే పూర్తయిపోయింది. లాక్డౌన్ వచ్చినప్పటి నుండి మళ్ళీ షూటింగ్ మొదలు కాలేదు.

ఈ నెల చివరి వారం నుండి ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అవనుందని అంటున్నారు. అందుకోసం అన్ని పనులు జరుగుతున్నాయని సమాచారం. ఐతే ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణయింపబడలేదు. ఇప్పటికే పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా మరో టైటిల్ ఫిలిమ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రానికి టార్చ్ బేరర్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట.

ఐతే టైటిల్ విషయమై రోజుకో వార్త వస్తున్నందున చిత్రబృందం వాటన్నింటికీ  ఫుల్ స్టాప్ పెట్టేందుకు సన్నద్ధం అవుతోందట. దసరా కానుకగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది. మరి ప్రచారంలో ఉన్న పేర్లే సినిమాకి పెడతారా లేదా మరేదైనా కొత్త టైటిల్ తో వస్తారా అనేది చూడాలి. మిర్యాల రవీందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Balayya- Boyapati movie Title will reveal on..:

Balayya- Boyapati movie Title will reveal on..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ