ఆయనో సీనియర్ యాక్టర్.. నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. నటుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రల్లో కనిపించాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఏ పాత్ర చేసినా తనదైన రీతిలో ఆ పాత్రకి పేరు తెచ్చే నటుడు.
నాజర్.. బాహుబలి సినిమాలో బిజ్జలదేవగా పేరుపొంది తెరమీద విలనిజాన్ని పండించిన నటుడు. ఐతే ప్రస్తుతం నాజర్ పేరు చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం తాజాగా ఆయన చేసిన ఫోటోషూట్. సాధారణంగా హీరో, హీరోయిన్ల ఫోటోషూట్లు జరుగుతుంటాయి. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంటాయి. సీనియర్ నటులు, అందునా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫోటోషూట్ చేయడం చాలా అరుదు. ఇంకా చెప్పాలంటే అసలు ఫోటోషూట్ లాంటి పనులే పెట్టుకోరు. ఒకవేళ పెట్టుకున్నా వాటిపై పెద్ద ఆసక్తి ఉండదు.
కానీ నాజర్ ఫోటోషూట్ ఆసక్తిని రేపింది. ట్రెండీ గెటప్ లో, మాంచి హెయిర్ స్టైల్ తో, అల్ట్రా స్టైలిష్ గా కనబడ్డాడు. ఫోటోల్లో కనిపిస్తుంది నాజరేనా అని ఒకక్షణం ఆగిపోయేలా చేస్తున్నాయి. మొత్తానికి సీనియర్ యాక్టర్ తన ఫోటోలతో ఒక్కసారిగా వార్తల్లోకొచ్చాడు.