Advertisementt

ఒక్కసారిగా అభిమానుల్లో ఊపొచ్చిందిగా..

Sun 13th Sep 2020 07:56 PM
allu arjun,pushpa,sukumar,adilabad,kuntala,fans  ఒక్కసారిగా అభిమానుల్లో ఊపొచ్చిందిగా..
Allu Arjun new look.. Fans excited ఒక్కసారిగా అభిమానుల్లో ఊపొచ్చిందిగా..
Advertisement

లాక్డౌన్ మొదలయినప్పటి నుండి సినిమా అభిమానులంతా ఒకరకమైన నిరుత్సాహంతో ఉన్నారు. కరోనా కారణంగా థియేటర్ల మూసివేత తప్పదు కాబట్టి ఏమీ చేయలేం. ఐతే థియేటర్లో బొమ్మ పడి ఐదున్నర నెలలు దాటిపోయింది. ఓటీటీలో సినిమా రిలీజ్ అయినా కూడా థియేటర్లో కనిపించే సందడి ఎలాగూ ఉండదు. ఈ నేపథ్యంలో సందడంతా సోషల్ మీడియాలోనే జరుగుతోంది. 

ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఎప్పుడు మొదలవుతాయా, ఆ అరుపులు, గోలలు ఎప్పుడు చూస్తామా, తమ అభిమాన హీరోలు స్టేజెక్కి మాట్లాడుతుంటే ఎప్పుడెప్పుడు విందామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. 

ఐతే తాజాగా అలాంటి సందడే కనిపించింది. ఆదిలాబాద్ లోని కుంతల జలపాతం చూడడానికి వచ్చిన అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ, అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు. ముఖ్యంగా అల్లు అర్జున్ గెటప్ బాగా ఆకర్షించింది. చిందరవందర జుట్టుతో పుష్ప సినిమా కోసం తయారు అవుతున్నాడని అనిపిస్తుంది. అల్లు . అల్లు అర్జున్ బయటకి రావడంతో జనాల్లో చాలా ఉత్సాహం కనిపించింది. లాక్డౌన్ మొదలయినప్పటి నుండి ఏ సందర్భం ఎదురయినా సోషల్ మీడియాలో సందడి జరుపుకుంటున్న అభిమానులకి అల్లు అర్జున్ బయట కనిపించడం కొత్త ఊపునిచ్చింది.

Allu Arjun new look.. Fans excited:

Allu Arjun new look.. Fans excited

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement