Advertisementt

అందం కాదు.. క్యారెక్టర్ ముఖ్యం: సమంత

Mon 14th Sep 2020 06:10 PM
samantha,beauty,character,important  అందం కాదు.. క్యారెక్టర్ ముఖ్యం: సమంత
Samantha talks about Beauty and Character అందం కాదు.. క్యారెక్టర్ ముఖ్యం: సమంత
Advertisement
Ads by CJ

హీరోయిన్స్ బయటికి వస్తే చాలు మొహానికి బెత్తెడు మందం మేకప్ మేత్తేస్తారు. మేకప్ లేకుండా హీరోయిన్స్‌ని చూడడం చాలా ఇబ్బందికర విషయమే. అందుకే హీరోయిన్స్ బయటికి వస్తున్నారంటే మేకప్ లేకుండా రారు. వారిని మేకప్ లేకుండా ఊహించుకోవడం కూడా కష్టమే. అందుకే హీరోయిన్స్ మేకప్ కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెడతారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ మేకప్ మ్యాన్‌ని పెట్టుకుంటారు. కేవలం అభిమానులను ఎట్రాక్ట్ చెయ్యడానికే హీరోయిన్స్ ఇంతగా కష్టపడుతుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం మాకులా మేకప్ వేసి సాధారణ అమ్మాయిలని బయటికి పంపినా హీరోయిన్స్‌లానే ఉంటారంటుంది. ఆమె ఎవరో కాదు అక్కినేని కోడలు, నాగ చైతన్య భార్య, టాప్ హీరోయిన్ సమంత అక్కినేని.

మీరు సూపర్‌గా ఉంటారు. చాలా అందంగా ఉంటారు, మహారాణిలా ఉంటారని చాలామంది నన్ను పొగుడుతుంటారు. కానీ మీరంతా అనుకున్నట్టుగా నేనేమి అందగత్తెని కాను అంటుంది సమంత. మరి ఎప్పుడు అందంగా, నాజూగ్గా, గ్లామర్‌గా కనిపించే సమంత అందగత్తె కాదా? అంటే కాదనే అంటుంది. అసలు మేకప్ వేసి, మంచి కాస్ట్యూమ్స్ వేసి కెమెరా ముందు నిలబెడితే నా వయసు ఉన్న అమ్మాయిలంతా నాలాగే అందంగానే కనిపిస్తారు. 

అయితే కాలేజ్ చదివేటప్పుడు అందం మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు అందంపై కలలు కనేదాన్ని. కానీ రాను రాను ఇప్పుడు అందంపై మోజు పోయింది. రెండు మూడేళ్లు పొతే ఈ అందం నాజూకు అన్నీ ఏమైపోతాయో. అందుకే అందం గురించి పట్టించుకోను. కాకపోతే మనిషికి వ్యక్తిత్వం ముఖ్యం. అలాగే కేరెక్టర్ ముఖ్యం. అందుకే అందం గురించి కాకుండా కేరెక్టర్ గురించే ఆలోచిస్తాను అని చెబుతుంది సమంత.

Samantha talks about Beauty and Character:

Not Beauty.. Character is Important says Samantha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ