తాజాగా టాలీవుడ్ దర్శకనిర్మాతలంతా ఓటిటీ బాట పడుతున్నారు. ముందుగా మీడియం రేంజ్ హీరో నాని వితో ఓటిటీని బోణి చేసాడు. వరసగా రాజ్ తరుణ్, నానినే ఫాలో అయ్యాడు. అయితే వి సినిమా తర్వత నెలకి రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా విడుదలవుతుంది. నెక్స్ట్ అనుష్క నిశ్శబ్దం అవ్వొచ్చుగా అంటున్నారు. ఇక తాజాగా షూటింగ్స్ పూర్తి చేసుకున్న సినిమాలు కూడా ఓటిటీ బాట పట్టినా పట్టొచ్చు. ఇక కరోనా సద్దుమణగక పోయిన హీరోలు ఒక్కొక్కరిగా బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసేస్తున్నారు. రెండు రోజుల క్రితమే సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసాడు. అయితే మిగిలిన షూటింగ్‌కి అంత స్పీడుగా కానిచ్చేసింది సాయి ధరమ్ సోలో బ్రతుకే సో బెటరుని ఓటిటీకి అమ్మెయ్యడానికే అనే టాక్ వినబడుతుంది.
సోలో బ్రతుకే సో బెటరు దర్శకనిర్మాతలు పట్టుబడితే సాయి ధరమ్ ఏం చేస్తాడు నానికి లాగే కాంప్రమైజ్ అవుతాడు. కానీ అన్న కాంప్రమైజ్ అయినా తమ్ముడు అవ్వనంటున్నాడు. ఎప్పుడో లాక్ డౌన్ కన్నా ముందే విడుదల కావాల్సిన ఉప్పెన సినిమా థియేటర్స్ బంద్‌తో వాయిదా పడింది.
అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటీలు ఎంత భారీ ధర ఆఫర్ చేసినా ఉప్పెన టీం మాత్రం మా సినిమా థియేటర్స్‌లోనే విడుదల అంటున్నది. మరి వైష్ణవ తేజ్ మాత్రం ఓటిటీకి తలొగ్గేలా కనబడడం లేదు. ఇక ఓటిటీకి అన్న సాయి ధరమ్ తేజ్ సై అన్న తమ్ముడు వైష్ణవ తేజ్ మాత్రం ఓటిటీకి సై అనేలా లేడు.