తెలుగు బుల్లితెర మీద వినోదానికి చిరునామాగా మారిన బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగవ సీజన్ ప్రారంభమైంది. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైన బిగ్ బాస్ షో, కాస్త కొత్తగా ఉంది. జనాలకి అంతగా తెలియని మొహాలని హౌస్ లోకి పంపించిన బిగ్ బాస్, ప్రేక్షకులని ఏ విధంగా ఎంటర్ టైన్ చేస్తాడన్నది సందేహంగా మారింది. బిగ్ బాస్ మొదలై వారం గడుస్తున్నా ఎవరు ఏంటనేది ప్రేక్షకులకి సరైన క్లారిటీ రాలేదు.
ఐతే జనాల్లో పాపులర్ కాని వాళ్లే హౌస్ లో ఉండడంతో, రెమ్యునరేషన్ విషయాలు చర్చకి వస్తున్నాయి. ఈ సారి అత్యధిక రెమ్యునరేషన్ ఎవరు తీసుకుంటున్నారనేది ఆసక్తిగా మారింది. గత ఏడాది యాంకర్ శ్రీముఖికే ఎక్కువ పారితోషికం అందినట్లు వార్తలు వచ్చాయి. ఈ సారి కూడా ఆ బంపర్ ఆఫర్ యాంకరే కొట్టేసిందంని అంటున్నారు.
మొత్తం పదహారు మంది కంటెస్టెంట్లలో జనాలకి బాగా తెలిసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు. సింగర్ నోయల్, యాంకర్ లాస్య. వీరిద్దరిలో యాంకర్ లాస్యకే ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఉంటుందని చెప్పాలి. అందువల్ల యాంకర్ లాస్య, ఈ ఏడాది అత్యధిక పారితోషికం తీసుకుంటుందని చెప్పుకుంటున్నారు.