Advertisementt

‘వి’.. దిల్ రాజు ప్లానే వేరప్పా...!

Sun 13th Sep 2020 07:37 PM
dil raju,happy,v movie,ott release,profit  ‘వి’.. దిల్ రాజు ప్లానే వేరప్పా...!
10 crore profit to Dil Raju with V movie ‘వి’.. దిల్ రాజు ప్లానే వేరప్పా...!
Advertisement
Ads by CJ

దిల్ రాజు డేర్ చేసి వి సినిమాని ఓటిటికి అమ్మేశాడు. థియేటర్స్‌లోనే విడుదల చేద్దామనుకున్న నాని, సుధీర్ బాబులని కూడా ఒప్పించినా దిల్ రాజు అమెజాన్‌తో బేరం కుదిర్చి వి సినిమాని భారీ లాభాలకు అమ్మేశాడు. ఆయితే వి సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5 న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే వి సినిమా హిట్టా లేదా యావరేజా అనేది అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటిస్తే తప్ప బయటపడదు. అదే థియేటర్స్‌లో అయితే రోజు వి సినిమా కలెక్షన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసేవి. వారం వారం వి కలెక్షన్స్ ఇంత అని మూవీ టీం అధికారికంగా ప్రకటించేది. కాని ఓటిటిలో విడుదలైన సినిమాలు హిట్ అనేది కేవలం రివ్యూస్ ద్వారా మాత్రమే బయటపడేలా కనబడుతుంది.

అయితే దిల్ రాజు వి సినిమాని థియేటర్స్‌లోనే విడుదల చేస్తానని చెప్పి ఉన్నట్టుండి అలా ఓటిటిలోకి విడుదల చేసేందుకు ఎందుకు మొగ్గు చూపాడా? అంటే అమెజాన్ ప్రైమ్ వారు దిల్ రాజు ఎలా పడేసారు? అనేది ఎవరికి అర్ధం కాలేదు. అయితే అమెజాన్ భారీ ధరను దిల్ రాజుకి ఆఫర్ చేసినట్టుగా టాక్ ఉంది. అయితే అది ఎంత అనే ఫిగర్ మాత్రం బయటికి రాలేదు. తాజాగా వి సినిమాని ఓటిటికి అమ్మడం ద్వారా దిల్ రాజు 10 కోట్ల లాభం పెట్టేసాడట. అందుకే అమెజాన్ ఒప్పందానికి దిల్ రాజు తలొగ్గాడని.. వి సినిమాని హీరోలని ఒప్పించి మరీ అమెజాన్‌కి అంటగట్టేసాడని ఫిలింనగర్ టాక్.

10 crore profit to Dil Raju with V movie:

Dil Raju Happy with V movie OTT Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ